జెఎన్‌టియు రెక్టార్ ఆఫీస్‌లో విద్యార్థుల విధ్వంసకాండ
హైదరాబాద్: విద్యార్థుల ఆందోళన, విధ్వంసంతో హైదరాబాదులోని కూకట్‌పల్లి జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెఎన్‌టియు) క్యాంపస్ అట్టడుకిపోయింది. వర్శిటీ ప్రాంగణంలో సృజనా టెక్నికల్ ఫెస్ట్ నిర్వహించిన ఏబీవీపీ భారీగా జెండాలు కట్టింది. వాటిని తీయలేదని వర్శిటీ రెక్టార్ కిషన్‌కుమార్‌రెడ్డి ఏబీవీపీ విద్యార్థులకు ఫోన్‌చేసి దూషించారని, కులం పేరుతో తిట్టారని, అసభ్యపదజాలం వాడారని ఆరోపణలు వచ్చాయి.
దాంతో ఆగ్రహించిన విద్యార్థులు తరగతులను బహిష్కరించి, రెక్టార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన కార్యాలయంలో విధ్వంసానికి దిగారు. ఫర్నిచర్, కంప్యూటర్లు, పూల కుండీలను ధ్వంసం చేశారు. రెక్టార్ ఫోన్‌లో మాట్లాడిన సంభాషణను ఏబీవీపీ విద్యార్థులు మీడియాకు విడుదల చేశారు.

కులం పేరుతో దూషించడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద ఏబీవీపీ నాయకుడు రెక్టార్‌పై పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే దీనిపై చర్యలు తీసుకోకుండా వర్శిటీ అధికారులు ఇచ్చిన పిర్యాదుపై ఏడుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో జెఎన్‌టియూ హైదరాబాద్ క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది.
పది రోజుల క్రితం సృజన 15 పేర రాష్ట్రస్థాయి టెక్నికల్ సింపోజియం ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన బ్యానర్ల తొలగింపు విషయంలో విద్యార్థులకు, రెక్టార్‌కు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్బంలో రెక్టార్ అసభ్య పదజాలంతో తమను దూషించాడని విద్యార్థులు 3రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications