RAC టికెట్ తో AC కోచ్ లో ప్రయాణించవచ్చా?
రైళ్లల్లో రద్దీ గురించి అందరికీ తెలిసిందే. అందులోను వేసవిలో ఇంకా రద్దీగా ఉంటాయి. ఏసీ బోగీల్లో టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముందస్తు ప్రయాణమైతే అందుకనుగుణంగా టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ అనుకోకుండా అప్పటికప్పుడే ప్రయాణం చేయాల్సి వస్తే టికెట్లు దొరకవు. దొరికినా ఆర్ఏసీ దొరుకుతుంది.
సీటు కన్ఫర్మ్ అయినవారు తమ ప్రయాణాన్ని రద్దుచేసుకుంటే ఆర్ఏసీలో ఉన్నవాళ్లకు బెర్త్ దొరుకుతుంది. లేదంటే కూర్చొని వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఏసీ బోగీలో ఆర్ఏసీ టికెట్ ఉంటే దుప్పటి, షీట్, దిండు ఉంటాయా? లేదా? అనే సందేహం అందరికీ వస్తుంది. ఆర్ఏసీలో ఒకే సీటు మీద ఇద్దరు ఉంటారుకదా.. దిండు, దుప్పటి, బెడ్ షీట్ ఎవరికి ఇస్తారో అనే అనుమానం సహజంగా వస్తుంటుంది.

ఆర్‌ఏసీ ప్రయాణికులకు గతంలో ఈ సదుపాయం ఉండేది కాదు. దీంతో ఏసీ కోచ్ లో ఆర్ ఏసీ కింద ప్రయాణం చేసేవారే ఇబ్బంది పడేవారు. వాటిని దృష్టిలో ఉంచుకొని 2017 నుంచి ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా దుప్పటి, దిండు, బెడ్ షీటు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆర్ఏసీ సీటుపై కూర్చున్న ఇద్దరికీ వీటిని అందజేస్తారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్లకు బెర్త్ కన్ఫార్మ్ అవ్వకపోతే.. ఆ రైలులోని జనరల్ కంపార్డ్‌మెంట్‌లోనే ప్రయాణించాల్సి ఉంటుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు సమకూర్చుతోంది. ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా వందేభారత్ పేరుతో రైళ్లను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ లు నడుస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వీటిని ఏర్పాటు చేశారు. ప్రయాణికుల నుంచి ఊహించనిరీతిలో ఆదరణ పెరుగుతుండటంతో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ కు అదనంగా మరో 8 రైల్వే కోచ్ లు యాడ్ చేశారు. ఆక్యుపెన్సీ కూడా ఈ రైలుకు 130 నుంచి 135 శాతం ఉంటోంది.












Click it and Unblock the Notifications