ఐపీఎల్ తరుణంలో అనాధ చిన్నారులకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఏసీఏ

క్రికెట్ అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా చూస్తూ ఉంటారు. ఇక ఐపీఎల్ అంటే చెప్పాల్సిన పని లేదు. ఈ పొట్టి క్రికెట్ లో ధనాధన్ బ్యాటింగ్ కి.. సూపర్ ఫాస్ట్ బౌలింగ్, మెస్మరైజ్ చేసే స్పిన్ తోడయ్యి ఫుల్ కిక్ ఇస్తుంది. చివరి నిమిషం వరకు ఎవరూ గెలుస్తారనే ఉత్కంఠ అందరికి మంచి హై ఇస్తూ ఉంటుంది. ఇక చిన్నారులకు అయితే ఒక్క మ్యాచ్ అయిన స్టేడియంలో చూడాలనే కోరిక ఉంటుంది.

అయితే వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఏసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. 30 అనాధ చిన్నారుల కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ఏసీఏ తన సొంత నిధుల‌తో 30 టికెట్స్ కొని వైజాగ్ లోని పాపా హోమ్ అనాథ శ‌ర‌ణాల‌యానికి అంద‌జేసింది. చిన్నారులకు మ్యాచ్ వీక్షించే అవకాశం కల్పించడం పట్ల ఏసీఏపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

aca-gave-an-unforgettable-gift-to-orphans-during-the-ipl-match-at-vizg

ఇక క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు పాపా హోమ్స్ చిన్నారులు సందడి వాతావరణంలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ ని వీక్షిస్తున్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్నికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు మ్యాచ్‌ను ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సైతం తిలకించనున్నారు. విశాఖలో మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దాంతో స్టేడియం వద్ద 1700 మంది పోలీసులతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరోవైపు ఐపీఎల్ 18వ సీజన్ లో జరుగుతున్న నాలుగవ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలవగా.. కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర ఘటన చవతో చేసుకుంది. టాస్ గెలిచిన అక్షర్‌ను బ్యాటింగ్ చేయాలంటూ పంత్ సరదాగా ఆటపట్టించాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+