లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి, 1.6 కేజీల బంగారం పట్టివేత
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఒకరు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. వివిరాల్లోకి వెళితే... వీవీఎస్ఎల్ ప్రసాద్ అనే అధికారి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు.
గుడ్లవల్లెరు మండలం గౌతవరం గ్రామానికి చెందిన నక్క రవికుమార్ కి చెందిన మిల్లు సరిగా నడవకపోవడంతో లైసెన్స్ రద్దు చేయాలని రెండు నెలల క్రితం ప్రసాదబాబును సంప్రదించాడు. అందుకు ప్రసాదబాబు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేనని రూ. 25 వేలు తీసుకొవాలని రవికుమార్ కోరాడు.

అనంతరం ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం వల పన్నిన ఏసీబీ అధికారులు గురువారం రవికుమార్ నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ప్రసాద బాబును పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
రూ.20 లక్షల విలువైన గంజాయి పట్టివేత
విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం పెదచెరువు దగ్గర రూ.20 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒకరని అదుపులోకి తీసుకుని, వారి వద్దనున్న వాహనం స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో 1.6 కేజీల బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 1.6 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అధికారులను చూసి బంగారాన్ని విమానంలోనే వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications