ఏపీలో ఏసీబీ దాడులు.. ఎమ్మార్వో ఆఫీసుల్లో ఉద్యోగులకు వణుకు పుట్టిస్తున్న సోదాలు
ఏపీలో ఇప్పుడు ఏసీబీ దాడుల కలకలం రేగింది. ఎమ్మార్వో ఆఫీసులను టార్గెట్ చేసి ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. అవినీతి అధికారుల భరతం పట్టమని, పారదర్శకంగా పనులు జరగాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు వణుకు పుట్టిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా వడమాల, పుత్తూరు, రేణిగుంట, నగరి తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.విశాఖలోని సబ్బవరం, భీమిలి, విజయనగరం జిల్లాలోని వేపాడు లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. శ్రీకాకుళంలోని కొత్తూరు, కర్నూలులోని కల్లూరు, ప్రకాశంలోని పొన్నలూరు, తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం, పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

అనంతపురంలోని ముదిగుప్ప, కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేట, కావలిలలో , గుంటూరులోని మాచర్ల, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ ప్రాంతాల్లో ఒకేసారి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఎమ్మార్వో కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications