చంద్రబాబుకు 14 రోజలు రిమాండ్ - కోర్టు తీర్పు, రాజమండ్రికి తరలింపు..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సంచలనం కలిగించిన చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో, చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ నుంచి కోర్టులో హోరా హోరీ వాదనల వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం కోర్టులో చంద్రబాబును ప్రవేశ పెట్టిన తరువాత వాదనలు దాదాపు ఏడు గంటల సేపు సాగాయి. చంద్రబాబును రిమాండ్ కు అనుమతి ఇవ్వాలని సీఐడీ కోరగా...చంద్రబాబు తరపున సిద్దార్ధ లూధ్రా వాదనలు వినిపించారు.
సిట్ కార్యాలయానికి చంద్రబాబు తరలింపు..!#ChandrababuNaidu #ChandrababuArrest #ChandrababuNaiduArrested #CorruptionKingCBN #HelloAP_ByeByeYCP #WeWillStandWithCBNSir #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/E5RgRV7S7K
— oneindiatelugu (@oneindiatelugu) September 10, 2023
లూద్రా వాదనలు : చంద్రబాబు రిమాండ్ రిపోర్టును సీఐడీ ఈ ఉదయం కోర్టులో రిమాండ్ రిపోర్టు సమర్పించింది. అందులో పలు ఈ స్కాంలో చంద్రబాబు పాత్ర పైన అనేక అంశాలను వివరించింది. చంద్రబాబు ప్రధాన ముద్దాయి గా పేర్కొంది. ఈ కేసులో లోకేశ్, అచ్చెన్నాయుడు పేర్లను సీఐడీ ప్రస్తావించింది. ఈ రిమాండ్ రిపోర్టును అనుమతిస్తూ రిమాండ్ కు పంపాలని సీఐడీ న్యాయస్థానంను కోరింది.

ఇక, చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది లూధ్రా కోర్టు ముందు అనేక విషయాలను ప్రస్తావించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రాజకీయ ప్రేరేపితంగా లూధ్రా పేర్కొన్నారు. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయని గుర్తు చేసారు. ఈ కేసులో తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది.. ఈకేసు ఎప్పుడో ముగిసింది. నిందితులందరికీ బెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు సంబంధం లేదు : ఏపీలో ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారని తన వాదనల్లో పేర్కొన్నారు. చంద్రబాబుపై చేసినవి ఆధారాల్లేని ఆరోపణలుగా వివరించారు. ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసిందని వాదించారు. సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదని లూద్రా వాదించారు.
ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌ను అదుపులోనికి తీసుకున్న సమయంలో సెక్షన్-409 వర్తించదని చెప్పిన అంశాన్ని గుర్తు చేసారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని, సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి వాడిన భాషను గమనించాలని కోరారు. చంద్రబాబును నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉందని, ప్రభుత్వం వాళ్లనుకున్న చోటే ప్రవేశపెట్టిందని వాదించారు.

అన్ని ఆధారాలు ఉన్నాయి : అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదని చెప్పుకొచ్చారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసును లూధ్రా ప్రస్తావించారు. దీనికి సమాధానంగా సీఐడీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదన వినిపించారు.చంద్రబాబు అరెస్ట్ చెయ్యడానికి గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. అన్ని నియమాలను తాము పాటించామని చెప్పారు.
మాజీ సీఎం అనేది గౌరవప్రదమైన హోదా మాత్రమేనని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రస్తుత హోదా ఎమ్మెల్యే మాత్రమేనన్నారు. చంద్రబాబు అవినీతి పైన పూర్తి ఆధారాలు ఉన్నాయని..నిధులను ఎక్కడకు తరలించారనేది స్పష్టత కోసం విచారణ చేయటానికి రిమాండ్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో వాదనల తరువాత న్యాయమూర్తి ఈ మేరకు సీఐడీ వాదనలతో ఏకీభవిస్తూ 14 రోజుల రిమాండ్ ఇస్తూ తీర్పు వెలువరించారు.












Click it and Unblock the Notifications