మైండ్‌గేమ్, టీడీపీపై ప్రశ్న: రేవంత్ నవ్వుతూ, అసహనంగా, ఏసీబీ హైడ్రామా.. తొలిరోజు

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు తొలిరోజు అయిన శనివారం నాడు విచారించారు. ఉదయం హైడ్రామా నడిచింది. రేవంత్, సెబాస్టియన్‌, ఉదయసింహల విచారణ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఏసీబీ అధికారులు ఉద్దేశపూర్వకంగా హడావుడి చేశారు. చర్లపల్లి జైలుకు ఉదయం 8 గంటలకు మూడు వాహనాల్లో చేరుకున్న అధికారులు లోపలికి వెళ్లి, జైలు అధికారులతో మాట్లాడారు.

గంట తర్వాత వాహనాల్లో బయటకు వచ్చేప్పుడు మీడియా ప్రతినిధులు, రేవంత్ తరఫువారు గుర్తించకుండా జీపులు, బస్సు కిటీకీ అద్దాలకు దినపత్రికలను అడ్డుగా ఉంచారు.

ఎవరిని తీసుకెళ్తున్నారో తెలీకుండా జాగ్రత్తలు చేపట్టారు. పది గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వాహనాలు చేరుకున్నాయి. వాహనాల్లో రేవంత్ బృందమంతా వచ్చారన్న భావనను ఏసీబీ అధికారులు కల్పించారు.

ACB questions TDP MLA Revanth Reddy in cash-for-vote case

అయితే ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించగా, తాము ఇంకా రేవంత్‌ని కస్టడీకి తీసుకోలేదని, నాలుగురోజుల సమయం ఉన్నందున విచారణ పురోగతి మేరకు తీసుకుంటామంటూ వివరించారు. రేవంత్ రాలేదన్న విషయం తెలుసుకున్న న్యాయవాదులు ఆయన ఎక్కడున్నారో చెప్పాలని అధికారులను నిలదీశారు.

చర్లపల్లి జైల్లోనే ఉంచామని ఇప్పుడు తీసుకొస్తున్నామంటూ వారు సమాధానమిచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు జైలుకు వెళ్లిన అధికారులు రేవంత్‌ని పోలీస్‌ జీపులో ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చారు. రేవంత్‌ని మానసికంగా ఇరుకునపెట్టే ఉద్దేశంతోనే అధికారులు ఇలా వ్యవహరించారని భావిస్తున్నారు.

తద్వారా రేవంత్‌ను ఒత్తిడికి గురి చేయాలని ఏసీబీ అధికారులు భావించారని అనుమానిస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో జరిగిన విచారణ అంతా అధికారులు వీడియోలో రికార్డు చేశారు. వస్తున్న వార్తల ప్రకారం.. అధికారులు తొలుత రేవంత్ బాగోగుల గురించి ఆరాతీశారు.

బాగానే ఉన్నానని చెప్పిన రేవంత్ కాసేపు ముభావంగా ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని, సహకరించాలని ఏసీబీ అధికారులు కోరారు. దానికి రేవంత్ సానుకూలంగా స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చిన దానిపై ప్రశ్నించారని తెలుస్తోంది.

టీడీపీలో పాత్ర గురించి అడిగారు. పార్టీలో ముగ్గురు నలుగురు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని రేవంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంలో మిగతా ఇద్దరు నిందితుల పరిచయంపై అడిగారని సమాచారం.

ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావించగా.. తనకేమీ తెలియదని, రాజకీయ కుట్రలో భాగంగానే కేసులో ఇరికించారని, వ్యక్తిగతంగా తనను, పార్టీని ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఇరికించారని రేవంత్ రెడ్డి సమాధానమిచ్చినట్లు సమాచారం. ఎసిబి అడిగిన అన్ని ప్రశ్నలకు రేవంత్ రెడ్డి చిరునవ్వు, కొంత అసహనంతో సమాధానాలు చెప్పారని తెలుస్తోంది.

కాగా, మధ్యాహ్నం భోజనం ఏసీబీ కార్యాలయంలోనే చేసిన రేవంత్ రెండుసార్లు టీ తాగారు. మిగతా ఇద్దరు నిందితులను విచారించిన అధికారులు ప్రధానం వారి కుటుంబ వివరాలు, ఆర్థిక వనరుల గురించి ప్రశ్నించారు.

ముగ్గురిమధ్య పరిచయం ఎలా కలిగింది, డబ్బు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ముగ్గురూ ఎక్కడ కలుసుకున్నారు, స్టీఫెన్ సన్‌తో మాట్లాండేందుకు రమ్మని చెప్పిందెవరు వంటి ప్రశ్నలు వేశారు. డబ్బు ఎలా సమకూర్చారన్న విషయాన్ని తేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సమాధానమిచ్చారు.

న్యాయవాదులు సుధీర్ కుమార్‌, రవికుమార్‌, రాకేష్ సింగ్‌లు మీడియాతో మాట్లాడుతూ... రేవంత్‌ని గంటసేపు, మిగతా ఇద్దరు నిందితులను నాలుగు గంటలపాటు విచారించినట్లు తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని, ఈ బృందాలు ముగ్గుర్నీ వేరువేరుగా విచారించినట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి పూర్తి స్త్థెర్యంతో సమాధానం చెప్పారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+