వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అధికారుల దాడులు... ఉద్యోగుల్లో గుబులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి . వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు . ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా , నెల్లూరు జిల్లాలలో అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.

అమరావతిలో అక్రమ మద్యం .. వాటర్ ట్యాంకులో 10వేల బాటిళ్ళు.. తెలంగాణా నుండి కొరియర్ లోఅమరావతిలో అక్రమ మద్యం .. వాటర్ ట్యాంకులో 10వేల బాటిళ్ళు.. తెలంగాణా నుండి కొరియర్ లో

తాజాగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఈఈ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు కార్యాలయంలో ఉన్న రికార్డులను, వాస్తవంగా జరిగిన పనులతో సరి పోలుస్తున్నారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించి రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు, అన్ని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ACB raids in government offices create Tension in AP

మరోవైపు ఆమదాలవలస రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆమదాలవలస రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో జరుగుతున్న ఏసీబీ దాడులలో గత రెండేళ్ల కాలంలో జరిగిన పనులు, బిల్లుల చెల్లింపు సంబంధించిన రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నారు.

ఆత్మకూరు రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. గ‌త రెండేళ్ల కాలంలో జ‌రిగిన ప‌నులు, బిల్లు చెల్లింపులకు సంబంధించిన రికార్డుల‌ను త‌నిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏక కాలంలో వివిధ జిల్లాల్లో జరుగుతున్న దాడులతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతోంది.

ఏసీబీ అధికారులు తనిఖీలతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మెరుపు దాడులు నిర్వహిస్తూ ఏసీబీ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని టెన్షన్ పెడుతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి అధికారుల భరతం పట్టమని, పారదర్శకంగా పనులు జరగాలని చెప్పిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై దృష్టిసారించి రంగంలోకి దిగాయి. దీంతో ఉద్యోగ వర్గాల్లో గుబులు పుడుతుంది .

English summary
The ACB attacks in the AP are stirring. ACB officials are conducting searches in various government offices. Attacks by ACB officials on various government offices have continued since the YCP came to power in the AP. Authorities continue to raid Srikakulam district, Visakhapatnam district and Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X