వైద్యఆరోగ్య శాఖలో లంచగొండి: ఏసిబికి చిక్కిన సూపరింటెండెంట్(పిక్చర్స్)
విశాఖపట్నం: నగరంలోని ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. అవినీతికి పాల్పడుతున్న సూపరింటెండెంట్ వెంకటరమణను ఏసిబి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ చంద్రకళ అనే నర్సు కొన్ని రోజులుగా సూపరింటెండెంట్ చుట్టూ తిరుగుతున్నారు. కాగా, ఆమెకు బిల్లులు మంజూరు కావాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని సూపరింటెండెంట్ వెంకటరమణ డిమాండ్ చేశారు.
దీంతో చేసేదేమీ లేక, బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం కార్యాలయంలో చంద్రకళ లంచం డబ్బు ఇస్తుండగా వెంకటరమణను, అతనికి సహకరించిన క్లర్క్ కె. నాగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

సూపరింటెండెంట్
విశాఖ నగరంలోని ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు.

ఏసిబి సోదాలు
అవినీతికి పాల్పడుతున్న సూపరింటెండెంట్ వెంకటరమణను ఏసిబి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

లంచం తీసుకున్న సొమ్ము
వివరాల్లోకి వెళితే.. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ చంద్రకళ అనే నర్సు కొన్ని రోజులుగా సూపరింటెండెంట్ చుట్టూ తిరుగుతున్నారు.

బాధితురాలు
కాగా, ఆమెకు బిల్లులు మంజూరు కావాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని సూపరింటెండెంట్ వెంకటరమణ డిమాండ్ చేశారు.

పట్టుబడ్డారు
దీంతో చేసేదేమీ లేక, బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

కార్యాలయం
వారి సూచన మేరకు మంగళవారం కార్యాలయంలో చంద్రకళ లంచం డబ్బు ఇస్తుండగా వెంకటరమణను, అతనికి సహకరించిన క్లర్క్ కె. నాగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications