జీతం కావాలంటే..లంచం కొట్టాల్సిందే:ఎసిబికి పట్టుబడ్డ రిమ్స్ అధికారి
కడప: ఎసిబి వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. రిమ్స్ పరిపాలనాధికారి ఆర్.భరత్‌మోహన్‌సింగ్ ఒక ఉద్యోగి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డారు. కడప రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చోటుచేసుకున్నఈ ఘటన కలకలం సృష్టించింది
ఎసిబి డిఎస్‌పి నాగరాజు మాట్లాడుతూ రిమ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించిన వివరాల మేరకు...అనంతపురం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఆఫీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సి.సురేష్‌కుమార్‌రెడ్డి నవంబర్‌లో కడప రిమ్స్‌కు బదిలీపై వచ్చారు. ఆ మేరకు రిమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎఒ భరత్‌మోహన్ సింగ్‌కు సి.సురేష్‌కుమార్‌రెడ్డి జాయినింగ్ లెటర్ ఇచ్చారు.

అయినప్పటికి నవంబర్ నుంచి ఇప్పటివరకు ఎవో ఆర్.భరత్‌మోహన్‌సింగ్ అతనికి సూపరింటెండ్ సీటును కేటాయించలేదు. అంతే కాదు మూడు నెలలకు సంబంధించి జీతాలు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సి.సురేష్‌కుమార్‌రెడ్డికి సీటు కేటాయింపు చెయ్యాలన్నా, జీతం చెల్లించాలన్నా తనకు లంచం ఇవ్వాలని ఎవో ఆర్.భరత్‌మోహన్‌సింగ్ డిమాండ్ చేశారు. లంచం లక్ష రూపాయలు ఇస్తేనే మీకు సంబంధించిన పనులు అవుతాయని రిమ్స్ ఎఒ స్పష్టం చేశారు.
దీంతో్ సురేష్‌కుమార్ రెడ్డి తమను సంప్రదించి ఈ విషయమై ఫిర్యాదు చేశారని ఎసిబి డిఎస్‌పి నాగరాజు చెప్పారు. దీంతో ఏవో భరత్‌మోహన్‌సింగ్ కు సురేష్‌కుమార్ రెడ్డి రూ.60 వేలు ఇస్తుండగా దాడులు చేసి పట్టుకున్నామని తెలిపారు. భరత్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications