విషాదం: ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు వెళుతూ ప్రాణాలొదిలిన యువతి

ప్రేమ పెళ్ళి చేసుకునేందుకు వెళ్తున్న ఓ జంట.. రోడ్డు ప్రమాదానికి గురైంది. ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద చోటు చేసుకుంది. రుద్రవరం మ

Recommended Video

    Kurnool AE Arrested By ACB for taking bribe from Farmers ఏసీబీ వలలో లంచగొండి జలగ. | Oneindia Telugu

    కర్నూలు: ప్రేమ పెళ్ళి చేసుకునేందుకు వెళ్తున్న ఓ జంట.. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద చోటు చేసుకుంది. రుద్రవరం మండలం ముత్తలూరుకు చెందిన విశ్వనాథరెడ్డి, నాగలక్మి కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు.

    ఇద్దరూ బందువులే కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నాగలక్మికీ గురువారం పెళ్లి చూపులు ఉన్న విషయాన్ని విశ్వనాథ్ రెడ్డి తెలుసుకొని.. ముత్తలూరులో ఉన్న నాగలక్మిని రహస్యంగా కారులో హైదరాబాద్ కు తీసుకెల్తుండగా... ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొంది.

    Accident: A girl killed and youth injured

    ఆ తర్వాత కారు బోల్తా పడటంతో అందులో ఉన్న నాగలక్మి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన విశ్వనాథ్ రెడ్డిని ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. విశ్వనాథ్ రెడ్డి రెండు కాళ్లు లేని దివ్యాంగుడు. అధిక వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

    చెరువులో బట్టలు ఉతకటానికి వెళ్లి: ముగ్గురు మృతి

    Accident: A girl killed and youth injured

    శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక రౌతువాని చెరువులో బట్టలు ఉతకటానికి వెళ్లి ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన నాగమ్మతో పాటు కుమార్తె శిరీష సమీప బంధువు దుర్గలు చెరువులో బట్టలు ఉతికేటందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు దుర్గ కాలు జారి చెరువులో పడిపోయింది. దుర్గను కాపాడే క్రమంలో నాగమ్మ, శిరీషలు మృతి చెందారు. స్థానికులు మృత దేహాలను వెలికి తీశారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళలు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+