ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: ముగ్గురు విద్యార్థులతోపాటు ఐదుగురు మృతి

Subscribe to Oneindia Telugu

గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం మండలంలోని రేపూడి గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. స్కూల్ విద్యార్థులతో వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు సహా అటో డ్రైవరు, మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలం హృదయవిదారకంగా మారింది. భీమవరం నుంచి విద్యార్థులతో వెళ్తొన్న ఆటోను ఫిరంగిపురం సమీపంలో శ్రీశైలం వెళుతున్న ఆర్టీసీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Accident in Phirangipuram: four killed

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మరికొందరు విద్యార్థులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

ప్రమాదానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారణమని తెలుస్తోంది. వేగంగా ఢీకొనడంతో నాలుగు పల్టీలు కొట్టిన ఆటో నుజ్జునుజ్జైపోయింది. ఐదుగురి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నారు. స్కూల్‌కు వెళ్లిన తమ చిన్నారులు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Four killed in road accident, which is occurred in Phirangipuram in Guntur district on Thursday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి