కంటైనర్ బోల్తా: ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
పశ్చిమగోదావరి: జిల్లాలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై భీమడోలు కూడలి వద్ద బస్టాండ్‌లోకి భారీ కంటైనర్ లారీ దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
కంటైనర్ కేబిన్‌లో చిక్కుకున్న మరో ముగ్గురుని బయటికి తీసిన పోలీసులు, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పెనుప్రమాదం జరగడంతో సంఘటన స్థలానికి భారీగా స్థానికులు చేరుకున్నారు.
తల్లీకూతుళ్ల ఆత్మహత్య

ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి సహా ఇద్దరు కూతుళ్లు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా కల్లూరు మండలం షరీన్‌నగర్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. షరీన్‌నగర్ కాలనీలో నివాసముంటున్న సుబ్బలక్ష్మి(39).. తన కూతుళ్లు వైష్ణవి(18 ), ఉదయభవాని(13)లతోపాటు సోమవారం అర్ధరాత్రి దాటాక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త ప్రియా పచ్చళ్ల ఏజెన్సీలో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.
ఆయన ఇంట్లో లేని సమయంలో వీళ్లు ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారు. కాగా, వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications