గోల్డ్ చోరీ కేసు: సూడో పోలీసుల పట్టివేత (పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని లక్డీకాపూల్‌లో 8 కేజీల బంగారం దోపిడీ కేసును పోలీసులు చేధించారు. సీపీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా దోపిడీకి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల్లా ఫోజు కొట్టి, ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేస్తున్నట్లు నటించి దొంగతనానికి పాల్పడిన సంఘటన ఇటీవల హైదరాబాదు నడిబొడ్డున లక్డిడీకా పూల్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - ఇద్దరు ప్రయాణికుల వద్దకు పోలీసుల రూపంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి సంచులు తనిఖీ చేయాలని అన్నారు. ఇద్దరు ప్రయాణికులు కూడా వారిని విశ్వసించలేదు. అయితే, కొంతదూరం వారిని బలవంతంగా తీసుకెళ్లి చేతిలో ఉన్న బ్యాగ్‌ను లాక్కుని పారిపోయారు. మొత్తం ఎనిమిది కిలోల బంగారాన్ని నిమిషాల వ్యవధిలో దొంగిలించారు.

ముంబైకి చెందిన ఎంవీఎస్‌ జువెలర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ బంగారు ఆభరణాలు తయారుచేసి దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ చేస్తుంటుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని పలు బంగారం దుకాణాల్లో మార్కెటింగ్‌ చేయడానికి సంస్థకు చెందిన జతిన్‌ ప్రతాప్‌ సిన్హా, దేవేంద్ర త్రివేదీతోపాటు మరో ఇద్దరు తొమ్మిదో తేదీన ఇక్కడకి వచ్చారు. బషీర్‌బాగ్‌, ఆబిడ్స్‌ ప్రాంతాల్లో ఉన్న షాపుల్లో మార్కెటింగ్‌ చేశారు.

బంగారం దొంగల పట్టివేత

బంగారం దొంగల పట్టివేత

బంగారం చోరీ కేసు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్‌, సెంట్రల్‌ జోన్‌లను నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి అభినందించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోరీ జరిగిన విధానాన్ని మహేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు.

బంగారం దొంగల పట్టివేత

బంగారం దొంగల పట్టివేత

సీసీ కెమెరా ఫుటేజ్‌ను మీడియాకు రిలీజ్‌ చేశారు. చోరీల నివారణకు అన్ని షాపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సూచించారు.

బంగారం దొంగల పట్టివేత

బంగారం దొంగల పట్టివేత

పోలీసుల్లాగా ప్రవర్తించి ఎనిమిది కిలోల బంగారాన్ని దొంగిలించిన నిందితులూ సిసి కెమెరాకు చిక్కినట్లు పోలీసులు అప్పుడే గుర్తించారు లక్డీకాపుల్‌ ఏపీ డీజీపీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న రెండు పెట్రోలు బంకులకు మధ్యలో హెచ్‌కేబీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ కార్యాలయం ఉంది. దీనికి పక్కనే హెచ్‌పీ పెట్రోలు బంకు ఉంది. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి.

బంగారం దొంగల పట్టివేత

బంగారం దొంగల పట్టివేత

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ కార్యాలయం వద్ద బస్‌స్టాప్‌ దగ్గర పోలీసు విభాగం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఉంది. బ్యాగ్‌ను దొంగిలించిన నిందితులు రవీంద్రభారతి వైపు పారిపోయారు. అక్కడ ఉన్న జంక్షన్‌లోనూ సీసీ కెమెరాలున్నాయి. వీటన్నింటిలోనూ నింది తుల కదలికలు నమోదై ఉంటాయని అప్పుడే పోలీసులు భావించారు.

జతిన్‌ ప్రతాప్‌ సిన్హా, దేవేంద్ర త్రివేదీ బెంగళూరు వెళ్లేందుకు టికెట్లు కొనుగోలుకు ఆదివారం సాయంత్రం లక్డీకాపుల్‌ హెచ్‌కేబీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ వద్దకు వచ్చారు. వీరితోపాటు వచ్చిన మరో ఇద్దరు ముంబై వెళ్లిపోయారు. టికెట్‌ కొనుగోలు చేసిన జతిన్‌, దేవేంద్ర త్రివేదీ బస్సు కోసం ట్రావెల్స్‌ వద్ద వేచి ఉన్నారు. రాత్రి 10.30 గంటలకు ముగ్గురు వ్యక్తులు నడుచుకుంటూ వారి వద్దకు వచ్చారు. తాము క్రైమ్ పోలీసులమని, బ్యాగులో ఏముందో చూపించాలని పోలీసుల మాదిరిగా ప్రశ్నించారు. ముందు అనుమానించిన జతిన్‌, త్రివేదీ వారిని గుర్తింపు కార్డులు చూపించమని అడిగారు. దీంతో పోలీసు తరహా యాక్షన్‌ చేశారు. వారిద్దర్నీ రవీంద్రభారతి వైపునకు కొంతదూరం బలవంతంగా లాక్కెళ్లారు.

ఎనిమిది కిలోల బంగారం ఉన్న బ్యాగ్‌ లాక్కుని మోటారు సైకిల్‌పై ఉన్న మరో వ్యక్తికి ఇచ్చి పంపేశారు. అనంతరం వారూ పరారయ్యారు. జరిగిన విషయాన్ని వెంటనే ముంబైలోని సంస్థ యజమాని వినీత్‌, ఎస్‌.గాంధీకి చెప్పారు. వారు సోమవారం హైదరాబాద్‌ వచ్చి సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బంగారం విలువ రూ.2.6 కోట్లుగా అంచనా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+