అక్కడకెళ్లి చెప్తావా?: బాబు దుమ్ముదులిపిన కృష్ణంరాజు, శ్రీరెడ్డి ఇష్యూపై స్పందన
Recommended Video

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీపై కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత కృష్ణంరాజు శుక్రవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. బీజేపీ పైన తప్పుడు ప్రచారం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు శుక్రవారం ఒక్కరోజు నిరాహార దీక్ష నేపథ్యంలో కృష్ణంరాజు స్పందించారు. ఏపీకి అన్యాయం జరిగిందని కర్నాటకకు వెళ్లి మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఏపీ జీడీపీ 11 శాతం ఉంది సరే, అది ఎక్కడిది?
ఆంధ్రప్రదేశ్ జీడీపీ 11 శాతం ఉందని చెబుతున్నారని, అది ఎలా వచ్చిందని కృష్ణంరాజు ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. విభజనకు ముందు లక్ష కోట్ల అప్పు ఉందని, చంద్రబాబు వచ్చాక అది రూ.2.34 లక్షల కోట్లకు చేరుకుందని మండిపడ్డారు.

అమరావతి డిజైన్లకే మూడేళ్లు పట్టింది
అసలు అమరావతి డిజైన్లకే మూడేళ్లు పట్టిందని కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాజకీయపరమైన నిర్ణయంతో విశాఖపట్నానికి రైల్వే జోన్ కచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుతో ఏపీకి పెరిగింది అప్పులు తప్ప చేసిందేమీ లేదన్నారు. ఈ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ పైన కూడా మాట్లాడారు.

శ్రీరెడ్డి ఇష్యూ
శ్రీరెడ్డి ఇష్యూపై స్పందిస్తూ.. పరిశ్రమలో కాస్టింగ్ కౌంచ్ కొత్తేమీ కాదని కృష్ణంరాజు అన్నారు. అన్ని రంగాల్లోను కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పారు. విమర్శించడానికి ఇప్పుడు సినీ పరిశ్రమ ఒక్కటే కనిపించిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో తప్పు జరిగిందని మొత్తం వ్యవస్థనే తప్పుపడతారా అని నిలదీశారు.

కాస్టింగ్ కౌచ్ మచ్చలాంటిది
టాలీవుడ్‌లో ప్రస్తుతం జరుగుతోన్న కాస్టింగ్ కౌచ్ తెల్ల పేపర్ పైన మచ్చలాండిది అని కృష్ణంరాజు అన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే మచ్చను తొలగిస్తాం కానీ పేపర్‌ను చిత్తు కాగితంలా మార్చమని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సినీ పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ విషయంలో మాత్రం మొత్తం చిత్తు కాగితంలా తయారు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. అది సరికాదని అభిప్రాయపడ్డారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications