ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం- సైనికుడి కుటుంబానికి అండగా మంచు విష్ణు : పిల్లలకు ఉచిత విద్య..!!
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మరణించారు. భారత తొలిసీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా మరణించారు. ఊహించిన ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేడ గ్రామం. ఆర్మీ అధికారులు ఆయన మరణించిన సమాచారాన్ని కుటుంబానికి చేరవేసారు. దీంతో..కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
ఎగువరేడ గ్రామం షాక్‌కు గురైంది. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్జా(5) పాప దర్శిని (2) సంతానం. ఆరేళ్ల క్రితం సాయితేజ్ సైన్యంలో చేరారు. నిత్యం వీడియో కాల్ ద్వారా భార్య - పిల్లలతో మాట్లాడుతూ ఉండేవారు. బుధవారం ఉదయం సైతం తాను తమిళనాడుకు డ్యూటీ మీద వెళ్తున్నానని చెప్పారు. మధ్నాహ్నానికి ఆయన మరణ వార్త వినాల్సి వచ్చింది. అయితే, ఈ కుటుంబానికి అండగా మంచు కుటుంబం ముందుకు వచ్చింది.

Recommended Video
తమ విద్యానికేతన్ సంస్థల్లో లాన్స్ నాయక్ సాయి తేజ ఇద్దరు పిల్లలను ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరుకు వచ్చి సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో మంచు కుటుంబం శ్రీ విద్యానికేతన్ ను నిర్వహిస్తోంది. కాగా, పలువురు సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ- 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో ప్రయాణిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. కాగా సాయితేజ అంత్యక్రియలు శుక్రవారం చిత్తూరు జిల్లా రేగడిపల్లిలో నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications