
థియేటర్ల మూసివేత చూస్తే ఏడుపొస్తుంది.. సినీ పరిశ్రమ పెద్దలపై ఆర్. నారాయణ మార్తి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో మూవీ టికెట్ రేట్ల దుమారం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం వర్సెస్ సినీ పరిశ్రమ అన్నట్లు సాగుతోంది. టికెట్ ధరపై పలువురు టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు తప్పుపడుతున్నారు. కాగా, ఒక వైపు థియేటర్స్‌పై అధికారుల దాడులు.. మరో వైపు తగ్గించిన టికెట్ ధరకు సినిమాలను ప్రదర్శలించలేమంటూ వాటి యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్లు థియేటర్స్‌ను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు

థియేటర్లు మూసివేస్తుంటే ఏడుపొస్తోంది..
ఏపీలో సినీ థియేటర్ల పరిస్థితులపై ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. శ్యామ్ సింగ్ రాయ్ సినిమా సక్సెస్ మీట్ కు ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు చోట్ల సినిమా థియేటర్లు మూసివేస్తుంటే ఏడుపొస్తుందన్నారు. సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడుంటేనే మూవీ ఇండస్త్రీ బాగుంటుందని పేర్కొన్నారు. థీయేటర్లు మూసివేయొద్దని యజమానులకు నారాయణ మూర్తి సూచించారు..

సినీ పెద్దలకు, సీఎం జగన్‌కు విజ్ఙప్తులు
తెలుగు సినీ పరిశ్రమ మీద ఆదారపడి కోట్లాదిమంది బతుకుతున్నారని నారాయణ మూర్తి పేర్కొన్నారు. పండుగల వేళ సినీ పరిశ్రమకు గడ్డు పరిస్థితి రాకూడదన్నారు. సమస్యను థియేటర్ల యాజమానులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. సినిమా హాళ్లను మూయోద్దని సూచించారు. ప్రస్తుత పరిస్థితిపై సినీ పెద్దలు, నిర్మాత మండలి, ఫిల్మ్ చాంబర్ పెద్దలు, మా అధ్యక్షడు, నిర్మాతలు, నటులు జోక్యం చేసుకోవాలన్నారు. సినీ పరిశ్రమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సమస్యని ఏపీ సిఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వంతో పాజిటివ్‌గా ఉండాలని , ఎమోషన్ అవ్వొద్దని సూచించారు. ప్రస్తుత సమస్యకు సీఎం జగన్ పరిష్కారం చూపాలని ఆర్. నారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..
ఈ సక్సెస్ మీట్‌లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. హీరో నానిని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. థియేటర్ల పరిస్థితి గురించి నాని ఒక విధంగా చెబితే దానిని కొందరు మరోలా తీసుకున్నారని పేర్కొన్నారు. నాని ఎమోషన్‌తో మాట్లాడే తప్ప నెగెటివ్‌గా కాదని చెప్పారు. ఆయన మాటలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు దిల్ రాజు..

4సినీ హీరోల వ్యాఖ్యలతో ఇబ్బందులు
మరోవైపు సినీ హీరోల వ్యాఖ్యలతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు ఏపీ థీయేటర్ల యాజమానులు, డిస్ట్రిబ్యూటర్లు. సినిమా థియేటర్లతో ధరలపై ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈమేరకు మంత్రి నానిని అపాయింమెంట్ కోరినట్లు చెప్పారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. రేపు ( మంగళవారం ) ఏపీ థీయేటర్ల యాజమానులు, డిస్ట్రిబ్యూటర్లు మంత్రి నానిని కలవబోతున్నట్లు సమాచారం.