వేధింపులు: ఇంటర్నేషనల్‌స్కూల్‌పై నటి రజని ఫిర్యాదు
హైదరాబాద్: దూలపల్లి సమీపంలోని డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలను ఆ పాఠశాల యాజమాన్యం, సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపిస్తూ సినీ నటి రజిని బుధవారం బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ప్రకారం తన పెద్ద కుమారుడు అజయ్ ఇదే స్కూలులో పదో తరగతి చదువుతున్నాడని, స్కూలు వారి మానసిక వేధింపులు తాళలేక మానివేశాడన్నారు.
7వ తరగతి చదువుతున్న కూతురు రికితను అక్టోబర్ 28న తరగతి టీచర్ అకారణంగా చెంప దెబ్బలు కొట్టారని ఆరోపించారు. ఈ విషయమై అదే రోజు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదే పాఠశాలలో 5వ తరగతి చదవుతున్న తన చిన్న కుమారుడు ధనుష్ అక్టోబర్ 31న బస్సులో అటు ఇటూ తిరుగుతున్నాడని ఇంగ్లీష్ టీచర్ వేధించారని ఫిర్యాదు చేశారు. ఈ విధంగా పాఠశాల యాజమాన్యం తన పిల్లల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు.

గురుకులంలో కీచకుడు
గురుకులంలో మంచి పోస్టు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి టీచర్‌ను నగరానికి రప్పించుకున్న ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పని చేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్ వారం రోజుల క్రితం మాసబ్‌ట్యాంక్‌లోని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కార్యాలయానికి వచ్చింది.
ఇక్కడ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీనిపై ఆమె గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టాలని మహిళా సంఘాలు డిమాండ్ చేయడంతో బుధవారం అతన్ని సస్పెండ్ చేస్తూ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు.
రోడ్డు ప్రమాదాల్లో పలువురు దుర్మరణం
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన చెత్త లారీ ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొంది. ద్విచక్ర వాహనంపై వెలుతున్న ఇద్దరు యువకులను చెత్తలారీ ఢీకొనడంతో ఆ బైకు ముందు వెళ్తున్న మరో బైక్‌ని ఢీకొనడంతో రెండు ద్విచక్ర వాహనాలపై ఉన్న నలుగురు యువకుల్లో ముగ్గురు దుర్మరణం చెందారు.












Click it and Unblock the Notifications