బయటకొచ్చి నిజం చెప్తానంటే రెచ్చగొడ్తారా: శివాజీ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిన నటుడు శివాజీ ఆరు కిలోల బరువు తగ్గారు. మధుమేహం, రక్తపోటు స్థాయిలు పడిపోయాయని వైద్యులు బుధవారం రాత్రి చెప్పారు. డీహైడ్రేషన్‌తో పాటు కడుపునొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట నాలుగు రోజులుగా శివాజీ దీక్ష చేస్తుండగా.. బుధవారం పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.
ఓ సమయంలో పోలీసులకు, శివాజీకి మధ్య వాగ్వాదం జరిగింది. తన దీక్షను పోలీసులు బలవంతంగా ఎలా భగ్నం చేసింది ప్రజలకు వివరిస్తానని శివాజీ చెప్పారు. అయితే, విలేకరుల సమావేశానికి నిబంధనలు అంగీకరించవని చెప్పారు.
దీంతో తాను ప్రజాస్వామ్య దేశంలో ఉన్నానా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు నిజాలు చెబుతానంటే పోలీసులు రెచ్చగొడుతున్నారని వాపోయిన శివాజీ.. తనకు తగిలించిన నీడిల్స్‌ను కూడా ఓ సందర్భంలో తీసేశాడు. తనను డిశ్చార్జ్ చేయాలని డిమాండ్ చేశాడు. వైద్యులు అందుకు నిరాకరించారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం వసంత దీక్ష
ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు కృష్ణా జిల్లా నందిగామలో గాంధీ విగ్రహం వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినానాదాలు చేశారు.
హోదా కోసం టీడీపీ ఎంపీల ఘెరావ్
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస రావు ఆధ్వర్యంలో పలువురు బుధవారం ఏపీ భవన్ లో కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి, టీడీపీ ఎంపీలను ఘెరావ్ చేశారు. అనంతరం ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చేందుకు పార్లమెంటు వైపు వెళ్తున్న చలసాని, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications