తెలివైనవారు, వారే ముఖ్యమంత్రి అవుతారు: శశికళకు నటుడు సుమన్ ఝలక్
తమిళనాడు రాజకీయ పరిణామాలు, జయ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు పైన ప్రముఖ నటుడు సుమన్ స్పందించారు. ఆస్తుల కేసులో జయలలిత, శశికళ, ఇళవరసి, దినకరన్‌లను దోషులుగా ప్రకటించడాన్ని స్వాగతించారు.
కర్నూలు: తమిళనాడు రాజకీయ పరిణామాలు, జయ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు పైన ప్రముఖ నటుడు సుమన్ స్పందించారు. ఆస్తుల కేసులో జయలలిత, శశికళ, ఇళవరసి, దినకరన్‌లను దోషులుగా ప్రకటించడాన్ని స్వాగతించారు.
తమిళనాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఇక తొలగిపోతుందని, ఆ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైనవారని, వారి అభిమానం ఉన్నవారే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. తమిళనాడులో జయలలితను చూసే అక్కడి ప్రజలు ఓట్లు వేశారన్నారు.

ముఖ్యమంత్రిని నిర్ణయించేది పార్టీ కాదని, ప్రజల నిర్ణయంతోనే అవుతారని చెప్పారు. తద్వారా శశికళ అభ్యర్థిత్వం పట్ల ఆయన విముఖత ప్రదర్శించారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications