ముద్రగడకు సినీ తారల మద్దతు: చిరు-దాసరి తర్వాత నటి హేమ

రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు సినిమా తారల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రముఖ సినీ నటి హేమ ఆదివారం నాడు ముద్రగడను పరామర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలోని ఆయన నివాసానికి హేమ వచ్చారు.

ముద్రగడ పైచేయి సాధించినా..: చిరు-దాసరిని ఇరుకునపడేసిన బాబు!ఈ సందర్భంగా ఆమె ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని, ఆయన కుటుంబ ఆరోగ్య పరిస్థితిని గురించటి అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ, ఆయన కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. కాగా, కాపులకు రిజర్వేషన్లు, తుని ఘటనలో అరెస్టైన వారిని విడుదల చేయాలని ముద్రగడ ఇటీవల పదమూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే.

Actress Hema visits Mudragada's house

ఆయన దీక్షకు కాపు నేతల నుంచి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించిన విషయం తెలిసిందే. కాపు నేతలు ఆయన దీక్షకు మద్దతుగా సమావేశాలు నిర్వహించి, చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా.

మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణ రావు, కాంగ్రెస్ నేతలు పళ్లం రాజు, వైసిపి నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులు పలుమార్లు ముద్రగడ దీక్షకు మద్దతుగా సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+