నటి రమ్యశ్రీ సేవ: దుస్తులు, ఆహారపదార్థాలు (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ నటి రమ్యశ్రీ తన దాతృత్వాన్ని, సామాజిక సేవా గుణాన్ని ప్రదర్శించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆమె పేదలకు దుస్తులు, తినుబండారాలు పంపిణీ చేశారు. మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతాన్ని విశ్వసించి ఆమె సేవా కార్యక్రమం చేపట్టారు.
హైదరాబాదులోని దుర్గంచెరువు వద్ద ఆమె గురువారం పేదలకు దుస్తులు, తినుబండారాలు పంపిణీ చేశారు. వారితో ఆమె కాసేపు గడిపారు. పిల్లలను ముద్దుగా పలకరించారు.
రమ్యశ్రీ తమ ప్రాంతానికి రావడం పట్ల దుర్గంచెరు ప్రాంతం స్థానికులు హర్షాతిరేకాలు ప్రదర్శించారు. చిన్నపిల్లలతో కాసేపు ఆటవిడుపుగా ఆమె గడిపారు.

రమ్యశ్రీ దాతృత్వం
నటి రమ్యశ్రీ గాంధీ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో దుర్గంచెరు ప్రాంతంలో పేదలకు దుస్తులు, తినుబండారాలు పంపిణీ చేశారు.

రమ్యశ్రీ దాతృత్వం
దుస్తులు, తినుబండారాలు పంచి పెట్టడంతో ఆపకుండా రమ్యశ్రీ అక్కడి పిల్లలతో గడిపారు. వారితో ఆటవిడుపుగా గడిపారు.

రమ్యశ్రీ దాతృత్వం
నటి రమ్యశ్రీ పేద పిల్లలకు తినుబండారాలు, దుస్తులు ఇవ్వడంతో వారిని ఎత్తుకుని లాలించారు. వారితో గడిపారు.

రమ్యశ్రీ దాతృత్వం
దుర్గంచెరువు ప్రాంతంలో నటి రమ్యశ్రీ పేదలకు దుస్తులు, తినుబండారాలు పంపిణీ చేశారు. పిల్లలకు తినిపించారు.

రమ్యశ్రీ దాతృత్వం
దుర్గంచెరవు ప్రాంతంలోని పేదల పిల్లలను నటి రమ్యశ్రీ ముద్దు చేశారు. వారిని ఎత్తుకుని చిరునవ్వులు చిందించారు.

రమ్యశ్రీ దాతృత్వం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో నటి రమ్యశ్రీ దుర్గంచెరు ప్రాంతంలోని పిల్లలకు తినుబండారాలు పంచి పెట్టారు.

రమ్యశ్రీ దాతృత్వం
నటి రమ్యశ్రీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారంనాడు దుర్గంచెరువు ప్రాంతంలోని పేద పిల్లలకు తినుబండారాలు, దుస్తులు పంచి పెట్టారు.












Click it and Unblock the Notifications