హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం
అగ్ర కథానాయిక సమంత కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్దికాలంపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు. సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని సమంత నిర్ణయించుకున్నారంటూ ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. ఆ రెండింటినీ పూర్తిచేసిన తర్వాత బ్రేక్ ఇస్తారని తెలుస్తోంది. సినిమాలకు అంత సుదీర్ఘమైన విరామం ఇవ్వాలని సమంత నిర్ణయించుకోవడంపై ఆమె అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత 'ఖుషి' సినిమా చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ కాగా హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. మరో మూడురోజుల్లో చివరి షెడ్యూల్ కూడా పూర్తవుతోందని విజయ్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో తెలిపాడు. మరోవైపు సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా చివరి దశకు చేరుకుంది.

ప్రస్తుతానికి ఎటువంటి కొత్త ప్రాజెక్టులు సమంత ఒప్పుకోలేదు. ఒక సంవత్సరం సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. గతంలో తాను తీసుకున్న అడ్వాన్స్ లన్నింటినీ ఆమె తిరిగిచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సర సమయంలో తన ఆరోగ్యాన్ని బాగుచేసుకోవడానికి, అదనపు చికిత్స ఉంటే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏడాది తర్వాతే కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోబోతున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన శాకుంతలం సినిమా సమంత కు భారీ షాక్ ఇచ్చింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో తన తర్వాత ప్రాజెక్టుల గురించి ఆమె ఆచితూచి అడుగులు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications