బందరు పోర్టు పైన ఆదానీ కన్ను : సగం వాటా కోసం ప్రయత్నాలు : ఆ సంస్థకు అందుకే చెక్ పెట్టారా..!!

ఏపీలో ఆదానీ సామాజ్ర్యం విస్తరిస్తోందా. మెజార్టీ పనులు దక్కించుకోవటంలో సక్సెస్ అవుతున్నారా. వారికే ఎందుకింత ప్రాధాన్యత. ఇప్పడు ఏపీ రాజకీయ వర్గాలతో పాటుగా..అధికార వర్గాల్లోనూ ఈ డిస్కషన్ వినిపిస్తోంది. కృష్ణపట్నం రేవు..గంగవరం పోర్టు దక్కించుకున్న ఆదానీ గ్రూపు తాజాగా సోలార్ ప్లాంట్ల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవరిస్తోందనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో తాజాగా.. ఇప్పుడు బందరు పోర్టులోనూ మెజార్టీ వాటా దక్కించుకొనేందుకు అడుగులు వేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ఏపీలో ఆదానీకి ప్రాధాన్యత పెరుగుతోందా

ఏపీలో ఆదానీకి ప్రాధాన్యత పెరుగుతోందా

అందులో భాగంగా..తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రచారానికి మరింత ఊతం ఇస్తున్నాయి. బందరు పోర్టు అనే దశాబ్దాల కల. ఈ పోర్టు కోసం ఉద్యమం తరువాత 2008 ఏప్రిల్‌ 23న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కరగ్రహారం వద్ద పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో ఈ పనులను మేటాస్‌ సంస్థతో కలిసి నవయుగ దక్కించుకుంది. మేటాస్‌ సంస్థ ఆ తర్వాత ఆర్థిక చిక్కుల్లో పడటంతో నవయుగ సంస్థకు పోర్టు పనులు అప్పగించారు. అయినా భూసేకరణ పనులు కొలిక్కి రాక పనులు ముందుకు సాగలేదు.

బందరు పోర్టు పై ఏం జరుగుతోంది

బందరు పోర్టు పై ఏం జరుగుతోంది

దీంతో 2011లో 510 రోజులపాటు పోర్టు నిర్మాణం చేపట్టాలంటూ అన్ని వర్గాలు, పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమం నడిచింది. దీంతో 2012 మేలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి 5320 ఎకరాలను కేటాయిస్తూ జీవో నెం.11 జారీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2015 ఆగస్టులో పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల కోసం 14 వేల ఎకరాలను కేటాయించాలని నిర్ణయించింది. ఇక, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోర్టు నిర్మాణంలో పురోగతి లేదంటూ 2019 ఆగస్టులో పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని మంత్రులు అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు.

ఆదానీ ప్రయత్నాలు ముమ్మరం చేసారా

ఆదానీ ప్రయత్నాలు ముమ్మరం చేసారా

ఈ పోర్టు నిర్మాణం కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు. కానీ, స్పందన రాలేదు. అయితే, రాజకీయ ఒత్తిడితో బందరు పోర్టులో 50 శాతం వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తమకు ఒక్కరికే మొత్తం ఇవ్వాలంటే సమస్యలు వస్తాయని భావిస్తే... సంగం వాటా తమకు అప్పగించాలని..మిగిలిన సగం రెండు కంపెనీలకు షేర్ చేయాలనే ప్రతిపాదన కీలక వ్యక్తుల వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. అదే సమయంలో మచిలీపట్నం గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైం బోర్డు రూ.3650 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఏడాది జూలైలో గ్లోబల్‌ టెండర్లను పిలిచింది. ఆగస్టు 24వ తేదీతో దీని గడువు ముగిసింది. కానీ... ఒక్క కాంట్రాక్టు సంస్థ కూడా టెండరు దాఖలు చేసేందుకు ముందుకు రాలేదు.

ఆదానీ గ్రూపు 50 శాతం వాటా కోరుకుంటోందా

ఆదానీ గ్రూపు 50 శాతం వాటా కోరుకుంటోందా

దీంతో... గడువును సెప్టెంబరు 14 వరకు పొడిగించారు. ఈసారీ స్పందన లేకపోవడంతో మళ్లీ 28వ తేదీ వరకు గడు వు పెంచారు. ఆదానీ బందరు పోర్టులో 50 శాతం మేర వాటా దక్కించుకొనేందకు చేస్తున్న ప్రయత్నాల కారణంగానే ఇతర నిర్మాణ సంస్థలు టెండర్లకు రావటం లేదనే వాదన వినిపిస్తోంది. బందరు పోర్టును సుమారు రూ.12,000 కోట్లతో ఆరు దశల్లో నిర్మించాల్సి ఉంది. తొలి దశలో ఓడరేవు నిర్మాణానికి రూ.3650 కోట్లతో ప్రతిపాదనలను తయారు చేశారు.

Recommended Video

    AP Economic Advisor గా Former SBI Chief Rajnish Kumar | AP CM Jagan || Oneindia Telugu
    బందరు పోర్టు పూర్తయ్యేదెన్నడు..

    బందరు పోర్టు పూర్తయ్యేదెన్నడు..

    ఐదు బెర్తుల నిర్మాణంతోపాటు డ్రెడ్జింగ్‌, బ్రేక్‌ వాటర్‌, స్టాక్‌యార్డు డెవల్‌పమెంట్‌, కార్గో హ్యాండ్లింగ్‌, విద్యుత్తు, అంతర్గత రహదారులు, రై లు పట్టాల ఏర్పాటు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. బందరుపోర్టు నిర్మా ణం జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుంది. అయితే, తాజాగా జరుగుతున్న ప్రచారం..ఆదానీ గ్రూపు ప్రమయం పైన స్పష్టత వస్తేనే ఈ పోర్టు భవిష్యత్ పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+