TTD: తిరుమలలో సీన్ రిపీట్ కాకూడదు, మీదే బాధ్యత, ఏఈఓ ఆర్డర్

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్‌వో శ్రీధర్‌తో కలిసి అదనపు ఈవో వెంకయ్య చౌదరి భద్రతా ఏర్పాట్లపై విస్తృతంగా సమీక్షించారు.

తిరుమల శ్రీవారి భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం, వాహనసేవలు జరిగేలా చూడాలని టీటీడీ, పోలీసు ఉన్నతాధికారులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. గరుడసేవ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాలరీలకు అన్నప్రసాదాలు చేరేలా చూడాలని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సూచించారు.

Additional EO orders from TTD to ensure that devotees coming to Tirumala do not face any problem

ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాల్లో టీటీడీ భద్రత, జిల్లా పోలీసులు పరస్పరం సమన్వయం చేసుకోవాలన్నారు.

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏర్పాట్లను, కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించడానికి ముఖ్యమైన అధికారులతో ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు ఏర్పాటు చెయ్యాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతం తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని సంబంధిత అధికారులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు చాలా మంది సొంత వాహనాల్లో వచ్చే అవకాశం ఉందని, శ్రీవారిని దర్శించుకోవాలని ఆత్రుతలో ఎక్కడంటే అక్కడ వాహనాలు పార్కింగ్ చేస్తే మిగిలిన భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, అలా జరగకుండా చూసుకోవాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+