ఏం మాటలవి, వాటిని ఎవరూ పట్టించుకోవద్దు: జేసీ వ్యాఖ్యలపై ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం
Recommended Video

కడప: దీక్షల వల్ల స్టీల్ ప్లాంట్ రాదన్న అనంతపురం సొంత పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఆదినారాయణ రెడ్డి శుక్రవారం వెంటనే స్పందించారు. ఇప్పటికే రాష్ట్రం పట్ల కేంద్రం వ్యతిరేకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో నిరాశపరిచేలా జేసీ మాట్లాడటం సరికాదన్నారు.
జేసీ దివాకర్ రెడ్డి లాంటి వ్యక్తి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని చెప్పారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆ బాధ ఏమిటో జేసీకి తెలుస్తుందన్నారు. దీక్షపై జేసీ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి మాటలు ఎవరూ పట్టించుకోవద్దన్నారు.

జేసీ దివాకర్ రెడ్డి ఏమన్నారంటే..
ఎంపీ సీఎం రమేష్ దీక్షకు సంఘీభావం తెలిపిన జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దీక్షల వల్ల ఉక్కు పరిశ్రమ.. తుక్కు ఏదీ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకులకు పగ, ప్రతీకారం ఉండకూడదన్నారు. ప్రధాని మోడీ ఏమీ చేయరని తాను మూడేళ్ల క్రితమే చెప్పానని అన్నారు. ఇప్పుడు సీఎంకు పరిస్థితి అర్థమైందన్నారు. జేసీ వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications