మమ్మల్ని గెలిపించావు సరే: జగన్‌కు ఆది సూటి ప్రశ్న, ఇరుకునపెట్టే యత్నం

Posted By:
Subscribe to Oneindia Telugu
  మమ్మల్ని గెలిపించావు సరే: జగన్‌కు ఆది సూటి ప్రశ్న, ఇరుకునపెట్టే యత్నం

  కడప: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆదివారం మండిపడ్డారు. మేమంతా ఆయన వల్లే గెలిచామని జగన్ చెబుతుంటారని, మరి ఓడిపోయిన 107 మంది సంగతి ఏమిటని నిలదీశారు.

  జగన్‌పై ఆది సెటైర్, నాపై-నాభార్యపై ఫేస్‌బుక్ కామెంట్లు: వైసిపిపై ఎమ్మెల్యే ఆగ్రహం

  తమ గెలుపుకు జగనే కారణం అయితే, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు 17 మంది ఎంపీ అభ్యర్థుల ఓటమికి కూడా జగనే కారణమా అని ప్రశ్నించారు. ఆయన వల్లే గెలిచామని చెబుతున్న జగన్, ఓడిపోయింది ఎవరి వల్లో చెప్పాలన్నారు.

  జగన్‌ను ఇరుకున పెట్టే యత్నం

  జగన్‌ను ఇరుకున పెట్టే యత్నం

  వారి ఓటమికి కారణం తానేనని జగన్ అంగీకరిస్తే, తాము గెలిచింది జగన్ వల్లేనని అంగీకరిస్తామని మంత్రి ఆదినారాయణ రెడ్డి వైసిపి అధినేతను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలోని పది స్థానాల్లోనూ టిడిపి విజయం సాధిస్తుందన్నారు.

  సమస్యలు పరిష్కరించి ఎన్నికలకు

  సమస్యలు పరిష్కరించి ఎన్నికలకు

  కడపలో ఆదివారం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రం విడిపోయాక ఎన్నో కష్టాలున్నా సీఎం చంద్రబాబు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడని తెలిపారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో మనం ఏంచేశామో, ఏం చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. వారి నుంచి వివరాలు సేకరించండి 50 రోజుల తర్వాత వచ్చిన నివేదికతో సమస్యలు సులువుగా పరిష్కరిద్దామన్నారు. ఈ సమస్యలన్నింటినీ పది నెలల్లో పూర్తి చేసి మరో ఎనిమిది నెలల తర్వాత ఎన్నికలకు వెళ్దామన్నారు.

  లేదంటే మాకు ఓటు వేయొద్దని ప్రజలకు చెప్పండి

  లేదంటే మాకు ఓటు వేయొద్దని ప్రజలకు చెప్పండి

  చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించాలంటే మనం ఇప్పటి నుంచే కష్టపడాలని, మనం పనులు చేస్తేనే గెలుస్తామని, మనం పనులు చేయకపోతే మీరు మాకు ఓటెయొద్దంటూ ఇంటింటా ప్రచారం చేయాలని ఆదినారాయణ రెడ్డి అన్నారు.

  కడపకు బంగాళాఖాతమట, నంద్యాలలో కొట్టుకుపోయారు

  కడపకు బంగాళాఖాతమట, నంద్యాలలో కొట్టుకుపోయారు

  నేనే ముఖ్యమంత్రినైతే కడపకు బంగాళాఖాతం తీసుకొస్తానని జగన్‌కు చెబుతాడని ఆయన మాటలు అలా ఉంటాయని అందుకోసం నంద్యాలలో ఆయన అనుచరులు కొట్టుకుని పోయారని జగన్ అన్నారు. పులివెందులలో టిడిపి గెలవాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Minister and Telugu Desam Party leader Adinarayana Reddy irks YSR Congress Party chief YS Jaganmohan Reddy with defeated leaders in 2014 general elections.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X