ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య
Aditya Pharmacy MD Suicide: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి విజయవాడలోని అయోధ్యనగర్‌లో ఉన్న క్షత్రియభవన్‌లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కోట్ల రూపాయల్లో అప్పులు ఉన్నట్లు ఆయన వద్ద సూసైడ్ లెటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

గతేడాది అక్టోబరులో నరసింహమూర్తి రాజు తన స్నేహితుడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యారు. ఇటీవలే ఆ కేసులో బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఆయన అనూహ్యంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నరసింహమూర్తిరాజు ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. సూసైడ్ వార్త తెలుసుకున్న ఆయన సతీమణి వెంటనే హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. నరసింహమూర్తి రాజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఆదిత్య ఫార్మసీ వ్యాపారాలు నిర్వహిస్తుండడం గమనార్హం.












Click it and Unblock the Notifications