ఎపిలో ఎస్టీ రిజర్వేషన్లపై...ఆదివాసి నేత సంచలన ఆరోపణలు
అమరావతి: ఎపిలో ఎస్టీ రిజర్వేషన్ల కు సంబంధించి ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ అధ్యక్షుడు మిడియం బాబురావు సంచలన ఆరోపణ చేశారు. వాల్మీకి, బోయ లను ఎస్టీ జాబితాలో కలపడానికి కావలసిన సామాజిక, ఆర్ధిక సాంస్కృతిక ప్రాతిపదిక ఏదీ లేనే లేదని ఆదివాసి మిడియం బాబురావు తేల్చిచెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో కేవలం రాజకీయ అవసరాల కోసం బీసీ జాబితాలో ఉన్న వారిని ఎస్టీ జాబితాలో కలుపుతున్నారని ఆరోపించారు. ఇలా ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీలు లేదని లోకుర్ కమిటీ తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. కారెం శివాజీ ఇచ్చింది తప్పుడు నివేదిక అని, దాని ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేశారని బాబురావు ఆరోపించారు.













Click it and Unblock the Notifications