వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌కు, ఫ్యాన్స్‌కు మరో షాక్: బీజేపీని మించి టీడీపీ షాకింగ్ కామెంట్!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: 2014 సార్వత్రిక ఎన్నికల విషయమై బీజేపీ తర్వాత, తెలుగుదేశం పార్టీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, ఆయన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు షాకిచ్చింది. ఓ విధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కంటే ఓ అడుగు ముందుకు వేసింది.

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీతో తాము పొత్తు పెట్టుకోలేదని, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమకు మద్దతు మాత్రమే ఇచ్చారని, ఏపీలో తమ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీయేనని ఏపీ బీజేపీ ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఇటీవల బాంబు పేల్చారు.

పవన్ కళ్యాణ్ కష్టపడితే, చంద్రబాబు అధికారం: రూటుమార్చిన బిజెపి, కాంగ్రెస్

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అంతకు మించిన కామెంట్లు చేసింది. టిడిపి నేత, శాసన మండలి సభ్యులు బుద్ధా వెంకన్న గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరి పొత్తుతోనో, మద్దతుతోనే కాదని, చంద్రబాబు రెక్కల కష్టం పైన అధికారంలోకి వచ్చామని చెప్పారు.

After BJP, now Telugudesam shocks Jana Sena chief Pawan Kalyan and fans.

బీజేపీకి తగిలినా.. పవన్ కళ్యాణే టార్గెట్

బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌తో పాటు బీజేపీకి కూడా తగులుతాయని చెప్పవచ్చు. మోడీ పవా, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కారణంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చారని విపక్షాలు చెబుతున్నాయి.

పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగా తాము అధికారంలోకి వచ్చామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అనంతరం టిడిపి నేతలు చెప్పారు. బీజేపీ కూడా అదే విషయం చెప్పింది. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు రివర్స్ గేర్ వేశాయి.

తమకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని, తాము జనసేనతో పొత్తు పెట్టుకోలేదని బీజేపీ నేత చెప్పగా, అసలు చంద్రబాబు రెక్కల కష్టం వల్లే అధికారంలోకి వచ్చామని, ఎవరు పొత్తు, మద్దతుతో రాలేదని అంతకుమించిన వ్యాఖ్యలు టిడిపి నేత చేశారు.

నాడు ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు సహా పలువురు బిజెపి,క టిడిపి నేతలు పవన్ కళ్యాణ్ వల్ల గెలిచామని చెప్పుకున్నారు. పవన్ వల్లే కాపు ఓట్లు, యువత ఓట్లు టిడిపికి పడ్డాయని అంటున్నారు. మోడీ హవా వల్ల యువత ఓట్లు పడ్డాయని చెబుతుంటారు. కానీ ఇప్పుడు పవన్‌కు అంతా రివర్స్ అయింది.

English summary
After BJP, now Telugudesam shocks Jana Sena chief Pawan Kalyan and fans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X