చంద్రబాబు తర్వాతి వంతు: హైదరాబాద్ నుంచి మకాం ఎత్తేస్తున్న జగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు నుంచి తన మకాంను ఎత్తేయనున్నట్లు తెలుస్తోంది. పల్స్ సర్వేలో తన పేరును ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నమోదు చేసుకున్నారు. కాగా, ఆయన తన మకాం ఎప్పుడో విజయవాడ సమీపంలోకి మార్చేశారు.

ఇక ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. గుంటూరు జిల్లాలోని ఎపి రాజధాని ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి సమీపంలో జగన్ కోసం ఓ ఇంటిని వెతుకుతున్నారు. ఆ ప్రాంతంలో ఓ ఇంటిని కొనడానికైనా సరే, అద్దెకు తీసుకోవడానికైనా సరే అన్నట్లు జగన్‌కు సంబంధించిన వారు గాలిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా మంగళగిరి సమీపంలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2019లో అధికారంలోకి వస్తే జగన్ ఒంగోలులోనో, రాయలసీమ ప్రాంతంలోనో అేధికారిక నివాసం ఏర్పాటు చేసుకుంటారనే ప్రజల అపోహలను తొలగించడానికి ఆయన మంగళగిరి ప్రాంతంలో నివాసం కోసం వెతుకుతున్నట్లు చెబుతున్నారు.

After Chandrababu Naidu, Jagan Mohan Reddy to bid goodbye to Hyderabad

గుంటూరు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయ భవనం కోసం స్థలాన్ని కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గుర్తించినట్లు తెలుస్తోంది. కడప జిల్లా పులివెందులలో జగన్‌కు ఓటు హక్కు ఉంది. హైదరాబాదులో ఉంటూ తరుచూ జగన్ పులివెందులకు వెళ్లి వస్తుంటారు.

లోటస్ పాండ్‌లోని జగన్ ఇంటిని, పార్టీ కార్యాలయాన్ని ఈడి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. కేసులో సిబిఐ ఆ ఆస్తులను పేర్కొనలేదని, అందువల్ల అటాచ్‌మెంట్‌ చట్టవిరుద్ధమూ అవాంఛనీయమని వాదిస్తూ కోర్టుకెక్కాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆలోచన చేస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
While Chief Minister N. Chandrababu Naidu ceases to be a Hyderabadi with his enrollment in pulse survey on July 9, Opposition leader Y.S. Jagan Mohan Reddy is now ready to say goodbye to Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి