ఈడీ చేతుల్లోకి ఆ టీడీపీ హయాం స్కాం ! నలుగురు నిందితుల అరెస్ట్ ?
ఏపీలో టీడీపీ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఇప్పటివరకూ ఏపీసీఐడీ దర్యాప్తు జరుపుతుండగా.. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది.
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాంలో జరుగుతున్న సీఐడీ దర్యాప్తు ఇవాళ మరో మలుపు తిరిగింది. ఈ స్కాంలో ఇప్పటికే ఓ నిందితుడిని అరెస్టు చేసి తీసుకొచ్చి రిమాండ్ కోరగా.. దాన్ని కోర్టు తిరస్కరించింది. అయితే ఇవాళ ఇదే స్కాంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాంలో నలుగురు నిందితుల్ని అరెస్టు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వారిని విశాఖ తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్ అరెస్ట్‌తోపాటు డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్, పీవీఎస్‌పీఐడీ స్కిల్ సీఈవో ముకుల్‌చంద్ అగర్వాల్, సారా చార్టెర్డ్ అసోసియేట్స్‌కు చెందిన సురేష్ గోయల్ ఉన్నారు. ఈ నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయినట్లు ఈడీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ అయితే ఈ స్కాంలో మనీలాండరింగ్ జరిగిందా లేదా అన్నది ఇంకా తేలలేదు. కానీ ఈడీ చర్యలతో మనీలాండరింగ్ కూడా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కాంలో సీమెన్స్ సంస్ధ తప్పు చేస్తే తమకేం సంబంధం అని టీడీపీ నేతలు ఇప్పటికే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ వైసీపీ సర్కార్ మాత్రం టీడీపీ హయాంలో జరిగిన ఈ స్కాంలో అప్పటి సీఎం చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపిస్తోంది. దీంతో ఈ కేసు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications