PV Ramesh : మేఘాకు పీవీ రమేష్ గుడ్ బై- స్కిల్ స్కాంపై వ్యాఖ్యల ఎఫెక్ట్ ? క్లారిటీ ఇదే..
ఏపీ ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ గా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిన పీవీ రమేష్ అనంతరం మేఘా ఇంజనీరింగ్ సంస్ధకు సలహాదారుగా పనిచేస్తున్నారు. అయితే ఆయన తాజాగా నిన్న ఈ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు ఆయన వ్యక్తిగత కారణాలు చూపారు. కానీ ఆయన రాజీనామా చేసిన సమయం, అంతకు ముందు చోటు చేసుకున్న పరిణామాల బట్టి చూస్తే అంతకు మించి ఏదో జరిగిందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కాం జరిగిందని చెబుతున్న సమయంలో ఆర్ధికశాఖ కార్యదర్శిగా పీవీ రమేష్ పనిచేశారు. అయితే ఆ తర్వాత ఆయన ఢిల్లీలో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్నాళ్లు వివిధ బాధ్యతలు చూసిన ఆయన.. ఆ తర్వాత జగన్ సర్కార్ పదవీకాలం పొడిగింపు ఇవ్వకపోవడంతో తప్పుకున్నారు. ఆ తర్వాత మేఘా ఇంజనీరింగ్ లో సలహాదారుగా పనిచేస్తున్నారు.

అయితే తాజాగా స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు సంబంధించి పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ స్కాంలో చంద్రబాబు పాత్ర ఉందని, ఆయనే సూత్రధారి అంటూ సీఐడీ ఆయన్ను అరెస్టు చేయడంపై పీవీ రమేష్ స్పందించారు.అలాగే తాను అప్రూవర్ గా మారి ఇచ్చిన సమాచారంతోనే చంద్రబాబు అరెస్టు అయ్యారన్న వాదనను ఖండించారు. అప్పట్లో నిర్ణయాలు తీసుకున్న అధికారుల్ని వదిలిపెట్టి ఎఫ్ఐఆర్ లో పేరు లేని చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదన్నారు. అంతే
కాదు అప్పట్లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించారు. దీంతో సీఐడీ ఇరుకునపడింది.
It is not correct to say that I have been asked to resign. 👇 https://t.co/fEL6dZfhMi
— Dr PV Ramesh (@RameshPV2010) September 12, 2023
అదే సమయంలో ఆయన హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి అప్పట్లో ఏం జరిగిందో పూర్తిగా వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇక్కడే సమస్య ఎదురైంది. అప్పటికే మేఘా ఇంజనీరింగ్ సంస్ధలో సలహాదారుగా పనిచేస్తున్న పీవీ రమేష్ ను ఈ ప్రెస్ మీట్ పెట్టకుండా సంస్ధ అడ్డుకుందని, దీని వెనుక వైసీపీ సర్కార్ ఒత్తిడి ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ సర్కార్ ఒత్తిడి మేరకే పీవీ రమేష్ తో మేఘా సంస్ధ రాజీనామా చేయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్వయంగా స్పందించారు. మేఘా సంస్ధ తనను రాజీనామా చేయమని కోరినట్లు వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు.
నా జీవితాంతం, నేను రాజకీయ, సామాజిక, ఆర్థిక, వాణిజ్య అంశాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం మరియు నిస్సందేహంగా పనిచేశాను. పెద్దగా ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా మరియు నా మనస్సాక్షికి విరుద్ధంగా ఏమీ చేయమని దేవుడు కాదు, ఎవరూ నన్ను బలవంతం చేయలేరు అని పీవీ రమేష్ తెలిపారు.












Click it and Unblock the Notifications