'పవన్ కళ్యాణ్ మౌనం ఆశ్చర్యం వేసింది': అధికారుల నిలదీత తర్వాతే..
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు స్పందించారు. దీనిపై చంద్రబాబు, టిడిపి సమాధానం చెప్పాలని నిలదీశారు.
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు స్పందించారు. దీనిపై చంద్రబాబు, టిడిపి సమాధానం చెప్పాలని నిలదీశారు.
అయితే ఆయన స్పందించడానికి ముందే ఐఏఎస్‌లు పలువురు దీనిపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, గతంలో ఉత్తరాది - దక్షిణాది అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ అంశంపై స్పందించక పోవడం వారు ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో పవన్ స్పందించారంటున్నారు.

ఏపీ ఐఏఎస్‌ల అసంతృప్తి
రాష్ట్రానికి చెందిన అధికారులను కాదని, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి ఈవో పదవి కట్టబెట్టడంపై పలువురు ఏపీ ఐఏఎస్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఈ విషయమై పవన్ ఎందుకు స్పందించడం లేదని ఆదివారమే అధికారులు గుసగుసలాడుకున్నారని తెలుస్తోంది.

ఆ ప్రశ్నలు సరే..
గతంలో పలు విషయాల్లో పవన్ కళ్యాణ్ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ టిటిడి ఈవో నియామకంపై ఆయన ఎందుకు స్పందించడం లేదని అధికారులు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. ప్రశ్నించేందుకే జనసేన పుట్టిందన్న పవన్.. ఎందుకు పెదవి విప్పడం లేదన్నారు.

చంద్రబాబు సర్కార్ మాటేమిటి
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం సవతి ప్రేమ కురిపిస్తోందని కూడా పవన్ గతంలో వ్యాఖ్యానించారు. అలాంటిది చంద్రబాబు సర్కార్.. సొంత రాష్ట్రానికి చెందిన అధికారులను పక్కన పెట్టి ఉత్తరాది అధికారికి ఈవో పదవి ఇస్తే ఎలా అని, దీనిపై పవన్ ప్రశ్నించరా అని అభిప్రాయపడ్డారు.

ఎట్టకేలకు పవన్ స్పందన
పవన్ మౌనం ఆశ్చర్యం వేసిందని ఓ అధికారి వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం పవన్ స్పందించిన విషయం తెలిసిందే. ఉత్తరాది వారికి తాను వ్యతిరేకం కాదని, కానీ అమర్నాథ్ వంటి చోట్ల మనకు అవకాశం లేనప్పుడు, టిటిడి ఈవోగా ఉత్తరాది వ్యక్తిని ఎందుకు నియమించారని జనసేన అధినేత ప్రశ్నించారు.
-
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications