యనమల ప్రస్థానం ఇక, ఆ వివాదంతోనే- వర్మ వాట్ నెక్స్ట్..!!
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. కూటమిలోని జనసేన, బీజేపీకి ఒక్కో ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. టీడీపీ నుంచి పలువురు ఆశావాహులు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసారు. సిట్టింగ్ లో బీటీ నాయుడుకు మాత్రమే అవకాశం దక్కింది. పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసారు. ఈ సారి సీటు ఖాయమని భావించినా అవకాశం దక్కలేదు. ఇక, సీనియర్ నేత యనమల కు సీటు రెన్యువల్ చేయలేదు. దీంతో, ఇప్పుడు ఈ ఇద్దరి రాజకీయ భవిష్యత్ ఏంటి..ఏం జరుగుతోంది.
సీట్లు త్యాగం చేసినా
మిత్రపక్షాలకు సీట్ల ఖరారు తరువాత టీడీపీ నుంచి మగ్గురికి ఎమ్మెల్సీ సీట్లు ఖాయమయ్యాయి. పార్టీ సీనియర్లు.. సీట్లు త్యాగం చేసిన వారికి దక్కలేదు. దీంతో, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివా సరావు రంగంలోకి దిగారు. 2027లో మరోమారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగను న్నాయిని.. వాటిలో ఛాన్స్ ఇస్తామని చంద్రబాబు చెప్పమన్నారంటూ ఆశావాహులకు ఫోన్ చేసి వివరించారు. పదవీ విరమణ చేస్తున్న వారిలో బీటీ నాయుడుకు ప్రత్యేక కారణాలతో తిరిగి ఛాన్స్ దక్కింది. సీనియర్ నేతల్లో యనమల.. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు సీట్లు ఇవ్వక పోవటం ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది. వర్మ తనక సీటు ఇవ్వకపోవటం పైన తన మద్దతు దారుల వద్ద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎమ్మెల్సీల ఖరారు వేళ
యనమల కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురు పదవుల్లో ఉన్నారు. కుమార్తె తుని ఎమ్మెల్యేగా, మైదుకూరు నుంచి వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్, అల్లుడు మహాశ్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. దీంతో, యనమలకు సీటు రెన్యువల్ చేయలేదని చెబుతున్నారు. యనమల సామాజిక వర్గం నుంచి బీదా రవిచంద్రకు సీటు ఖాయం చేసారు. అయితే, యనమలకు సీటు దక్కకపో వటం వెనుక తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో కొత్త చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకినాడ పోర్టు విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ యనమల చేసిన వ్యాఖ్యల తోనూ గ్యాప్ మొదలైనట్లు చెబుతున్నారు. దీంతో, జిల్లా పార్టీ నేతలు సైతం ఆయనకు దూరం పాటిస్తున్నారు.
యనమల భవిష్యత్
యనమలకు ఇప్పుడు సీటు రెన్యువల్ కాకపోవటం వెనుక ఇదే ప్రధాన కారణమనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. అయితే, యనమలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఆయన మద్దతు దారు లు చెబుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన పిఠాపురం నేత వర్మ కు సీటు విషయంలోనూ ఆసక్తి కర చర్చ మొదలైంది. పవన్ కు సీటు కేటాయించి ఆయన గెలుపు కోసం వర్మ పని చేసారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వర్మకు ప్రాధాన్యత ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. 2027 లో వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని భావిస్తే.. తిరిగి 2029 లో అసెంబ్లీ ఎన్నికల అంశాన్ని ఆయన మద్దతు దారులు గుర్తు చేస్తున్నారు. తాజాగా తనకు సీటు కేటాయించకపోవటం పైన వర్మ ఆవేదనతో ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం సీటు త్యాగం చేసినా కానీ తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదని వాపోతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ భవిష్యత్ హామీ
సీట్లు ఆశించి అవకాశం దక్కని నేతలను పార్టీ బుజ్జగించే ప్రక్రియ ప్రారంభించింది. పలువురు సీనియర్ నేతలు సైతం సీటు దక్కుతుందని ఆశించారు. మిత్రపక్షాలకు రెండు సీట్లు ఇవ్వటం తో పాటుగా సామాజిక - ప్రాంతీయ లెక్కలతోనే అవకాశం కల్పించ లేకపోయామని పార్టీ నేతలు వివరిస్తున్నారు. అయితే, పవన్ గెలుపు కోసం పని చేసిన వర్మకు ప్రాధాన్యత దక్కకపోవటం.. కొంత కాలంగా పిఠాపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన వర్మ మద్దతు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్మకు ఎమ్మెల్సీ పదవే ఇస్తారా.. లేక, ఆవేదనతో ఉన్న వర్మ కోసం మరో పదవి ఖరారు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు సీనియర్లలో మాత్రం తాజా ఎమ్మెల్సీ సీట్ల విషయం పైన ఆసక్తి కర చర్చ కొనసాగుతోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications