నాగబాబుకు మంత్రి పదవి వేళ కీలక పరిణామాలు..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. జనసేన సభ పైన మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మది నెలలు పూర్తయింది. బీజేపీ కూటమి పైన పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. తాజా జనసేన సభలో పవన్, నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు రుచించటం లేదు. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఇక, మంత్రివర్గంలో చేరటం లాంఛనమనే భావిస్తున్నారు. ఈ సమయంలోనే అనూహ్య పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి.
మంత్రిగా నాగబాబు
ఏపీలో కూటమిలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. తాజాగా అయిదు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అనూహ్యంగా చివరి నిమిషంలో ఎమ్మెల్సీ సీటు దక్కించుకుంది. జనసేన నుంచి పవన్ సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. టీడీపీ మూడు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావాహులు చివరి వరకు ప్రయత్నాలు చేసారు. సామాజిక సమీకర ణాలతో మూడు స్థానాలు ఖరారు చేసారు. ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి పైన జనసేనలో చర్చ మొదలైంది. జనసేన నుంచి ప్రస్తుతం పవన్, మరో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు నాగబాబుకు మంత్రిగా అవకాశం ఇవ్వటం ద్వారా సామాజిక లెక్కల పైన చర్చ జరుగుతోంది. కాగా, గతంలో ఇలాంటి వాదనను పవన్ తోసిపుచ్చారు.
నాగబాబుకే పరిమితం
ఇప్పుడు కేబినెట్ లో నాగబాబు చేరికకు ముహూర్తం పైన పార్టీలో చర్చ మొదలైంది. ఉగాది వేళ నాగబాబుకు కేబినెట్ లోకి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక.. ఇదే సమయంలో మంత్రివర్గంలో మార్పులు - చేర్పుల పైన కొన్ని విశ్లేషణలు మొదలయ్యాయి. నాగబాబుకు ఒకరికే కేబినెట్ లో అవకాశం కల్పిస్తారా.. లేక ఏమైనా మార్పులు ఉంటాయా అనేది కీలక అంశంగా మారుతోంది. గతం లోనే ఒకరిద్దరు మంత్రుల పైన చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. మంత్రులు గా బాధ్యతలు స్వీకరించి ఏడాది కూడా పూర్తి కాకపోవటంతో ఇప్పటికిప్పుడు కేబినెట్ లో మార్పు లు ఉండవనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక.. నాగబాబుకు శాఖల కేటాయింపు విషయం లోనూ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

శాఖల కేటాయింపు
నాగబాబుకు ప్రస్తుతం కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖలు అప్పగిస్తా రనే ప్రచారం జరుగుతోంది. దుర్గేశ్ కు క్రిష్ణా జిల్లాకు చెందిన మంత్రి వద్ద ఉన్న ఒక శాఖను అప్పగి స్తారని భావిస్తున్నారు. జనసేన మంత్రుల వద్ద ఉన్న శాఖలనే సర్దుబాటు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీని ద్వారా ఇక నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ఇప్పటికే నిర్ణయం జరగటంతో.. ఇక, ముహూర్తం ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. మరి.. మంత్రివర్గంలో మార్పులు.. నాగబాబు శాఖల ఖరారు విషయంలో అంతిమంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications