ఎన్టీఆర్ భారతరత్నకు లైన్ క్లియర్ ? కాయిన్ రిలీజ్ టీజర్ సక్సెస్ !
ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు రాలేదన్న ప్రశ్నకు రాజకీయాలే అన్న సమాధానం తెలుగు రాష్ట్రాల్లో సహజంగా వినిపిస్తుంటుంది. అయితే ఇంతకు మించి ఈ అవార్డును కేంద్రం ప్రకటిస్తే ఆయన భార్య లక్ష్మీపార్వతి అందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులే అడ్డుకున్నారన్న చర్చ కూడా అంతే సాధారణంగా జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్దితుల్లో నిన్న ఎన్టీఆర్ పేరుతో ఓ స్మారక నాణేన్ని రాష్ట్రపతి ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చాలా ప్రత్యేకతలు కనిపించాయి.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రం తయారు చేసిన స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి ఆయన భార్య లక్ష్మీపార్వతి మినహా మిగిలిన ఎన్టీఆర్, నారా కుటుంబ సభ్యులు, పలువురు బీజేపీ, టీడీపీ ఎంపీలు, వైసీబీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కూడా ఆహ్వానం అందింది. దీంతో వీరంతా నిన్న ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ ఛీఫ్ గా ఉన్న ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి స్వయంగా లీడ్ చేశారు. దీంతో పాటు లక్ష్మీపార్వతి ఎంత మొత్తుకున్నా ఆహ్వానం దొరకలేదు.

తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ భారతరత్న అవార్డుకు కూడా లైన్ క్లియర్ అయినట్లేనని భావిస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లూ ఏ లక్ష్మీపార్వతి భయంతో అయితే ఎన్టీఆర్, నారా కుటుంబ సభ్యులు ఆయనకు భారతరత్న అవార్డును అడ్డుకుంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు వారే ఎన్టీఆర్ కాయిన్ రిలీజ్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. దీంతో లక్ష్మీపార్వతి లేకుండానే కీలక కార్యక్రమం పూర్తయిపోయింది. దీనిపై లక్ష్మీపార్వతి ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.
ఇప్పుడు తండ్రి ఎన్టీఆర్ పేరుతో కాయిన్ రిలీజ్ లాగే భారతరత్న అవార్డు కూడా ఇప్పించే విషయంలోనూ పురందేశ్వరి చొరవ చూపుతారని భావిస్తున్నారు. భారతరత్న అవార్డు ప్రకటిస్తే ఎన్టీఆర్ వారసులుగా తామే తీసుకునేందుకు కేంద్రం కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. దీంతో పాటు ఎన్టీఆర్ లెగసీని క్యాష్ చేసుకునేందుకే పురందేశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపిక చేసింది. కాబట్టి ఇదే ఊపులో భారతరత్న అవార్జు కూడా ఇప్పించుకోవాలని పురందేశ్వరి వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికీ ఎలాగో లక్ష్మీపార్వతిని ఆహ్వనించే అవకాశం ఉండదని తేలిపోవడంతో ఈసారి వర్కవుట్ అయినా ఆశ్చర్యం లేదు.












Click it and Unblock the Notifications