ఏడాది తర్వాత 'కొత్త' సభలో అడుగుపెట్టిన రోజా, పూజలు చేసిన జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు, నటి రోజా సోమవారం నాడు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆమె అసెంబ్లీ లోపలకు వస్తుండగా ఎవరూ అడ్డుకోలేదు. సోమవారం ఉదయం ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు, నటి రోజా సోమవారం నాడు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆమె అసెంబ్లీ లోపలకు వస్తుండగా ఎవరూ అడ్డుకోలేదు. సోమవారం ఉదయం ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
నవ్యాంధ్రలో ఇవి తొలి సమావేశాలు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వైసిపి ఎమ్మెల్యేలు బస్సులో వచ్చారు. పార్టీ అధినేత జగన్‌తో కలిసి ఎమ్మెల్యేలు అంతా బస్సులో అసెంబ్లీకి వచ్చారు.
అందులో రోజా కూడా ఉన్నారు. తొలుత వైసిపి కార్యాలయంలోకి, ఆ తర్వాత అందరితో కలిసి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆమెను ఏ అధికారి కూడా అడ్డుకోలేదు. రోజా పైన విధించిన ఏడాది సస్పెన్షన్ పూర్తయింది. దీంతో ఆమెను సభలోకి రానిచ్చారు.

మరో ఏడాది పాటు సస్పెన్షన్‌పై..
ఇదిలా ఉండగా, రోజాపై మరో ఏడాది పాటు సస్పెన్షన్ విధించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీ స్పీకర్‌కు నివేదిక ఇస్తుందని, అసెంబ్లీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.

అనుచిత ప్రవర్తనతో..
అనుచితంగా ప్రవర్తించిన కారణంగానే రోజాపై ఏడాది పాటు వేటు వేశారని, అలాంటప్పుడు మళ్లీ పొడిగించడం అనే ప్రచారం ఎందుకు జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

మళ్లీ పొడిగింపు..
సీఎం చంద్రబాబుపై, టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల వల్లే ఆమె పైన ఏడాది సస్పెన్షన్ విధించారు. మళ్లీ పొడిగింపు అనడం సరికాదని అంటున్నారు.

తన చాంబర్లో పూజలు నిర్వహించిన జగన్
అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి వైయస్ జగన్ ప్రవేశించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఆయన తన ఛాంబర్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఆయన పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications