వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న పాదయాత్ర నేడు తిరుమల యాత్ర అంతే తేడా... మిగతాదంతా సేమ్ టూ సేమ్

|
Google Oneindia TeluguNews

ఒక ఏడాదిగా ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేసి బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగించిన వైయస్ జగన్ తిరుమల చేరుకున్నారు. తిరుమలకు చేరుకున్న జగన్ అక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన బయలుదేరారు. అయితే ఇన్ని రోజులు జగన్ చేసిన పాదయాత్ర ఒక ఎత్తయితే... తిరుమలకు కాలినడకన పాదయాత్ర చేయడం మరో ఎత్తని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే జగన్ చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌కు వచ్చారు.

పద్మావతి అతిథి గృహంలో జగన్

పద్మావతి అతిథి గృహంలో జగన్

రైల్వే స్టేషన్ నుంచి పద్మావతి అతిథి గృహంకు జగన్ చేరుకునే క్రమంలో దారిపొడవున అభిమానులు ఆయన కాన్వాయ్‌ను ఫాలో అయ్యారు. పద్మావతి అతిథి గృహంలో జగన్‌కు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఇక మధ్యాహ్న సమయంలో జగన్ కాలినడకన తిరుమల స్వామివారి కొండకు బయలుదేరారు. అక్కడ కూడా అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నిన్ను నమ్మం బాబూ.. అంటున్నారు, చంద్రబాబుతో మనకు సావాసం వద్దబ్బా అన్నారు: జగన్నిన్ను నమ్మం బాబూ.. అంటున్నారు, చంద్రబాబుతో మనకు సావాసం వద్దబ్బా అన్నారు: జగన్

వేలిముద్ర వేసిన జగన్

వేలిముద్ర వేసిన జగన్

ఇక అలిపిరి మెట్లు దాటి గాలిగోపురం వరకు చేరుకున్న జగన్ అక్కడ ఉన్న టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లి వేలిముద్ర వేసి టికెట్ తీసుకున్నారు. అనంతరం నడక ప్రారంభించారు. గోవింద నామస్మరణతో కొండ ప్రాంతమంతా మారుమోగిపోయింది. సామాన్యుడిలా క్యూలో నిలబడి జగన్ టికెట్ తీసుకుంటున్న సమయంలో పలువురు ఆశ్చర్యంగా చూశారు.

శారాధా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు

శారాధా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు

సాయంత్రం సమయంకల్లా స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుంటారు. ఇక గురువారం రాత్రి జగన్ తిరుమలలోనే బసచేస్తారు. అనంతరం శుక్రవారం ఉదయం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకు బయలు దేరి వెళతారు.

English summary
After Oneyear long padayatra AP opposition leader YS Jagan Reddy visited the Lord Balaji temlpe in Tirumala. On reaching Tirumala Jagan started to walk to reach the hill shrine temple. On the way the opposition leader stood in a queue and took the ticket by giving his biometric fingerprints like anyother common man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X