డీఎస్సీ నోటిఫికేషన్ పై బిగ్ అప్డేట్..!!

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్దమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని హామీ ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యత లు స్వీకరించిన తరువాత ఈ అంశం పైనే తొలి సంతకం చేసారు. నోటిఫికేషన్ జారీ ప్రక్రియ ఆ లస్యం అయింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రక్రియ పూర్తి చేస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు నోటిఫికేషన్ జారీకి రూట్ క్లియర్ అయింది. హామీ అమలు దిశగా కసరత్తు కొనసాగుతోంది.

ఎస్సీ వర్గీకరణ
ఏపీలో 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత నోటిఫికేషన్ జారీ పైన కసరత్తు జరుగుతోంది. 16,347 పోస్టుల భర్తీకి వీలుగా కార్యాచరణ మొదలైంది. జూన్ లో మొదల య్యే విద్యా సంవత్సరం లోగా ఈ భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇదే సమయం లో ఎస్సీ వర్గీకరణ అంశం తెర మీదకు రావటం.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో ఈ అంశం పైన స్పష్ట త ఇచ్చిన తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఎస్స వర్గీకరణ పైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు ఏపీ మంత్రివర్గం ఆమోదించింది. తాజాగా అసెంబ్లీలో ఈ నివేదిక అమలు దిశగా తీర్మానం చేసారు. ఈ సమయంలోనే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

అసెంబ్లీలో ప్రకటన
అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని వివరించారు. అదేవిధంగా జిల్లాల వారీగా కేటగీరి విభజన చేయాల్సి ఉంటుందన్నారు. జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగీరిల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. వర్గీకరణ పైన నిర్ణయం తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఇక, తాజాగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ 59 ఉపకులాలను మూడు కేటగి రీలుగా విభజించి రిజర్వేషన్లను కేటాయించారు. దాని ప్రకారం.. 8శాతం పోస్టులు మాలలు, ఉప కులాలు; ఆరు శాతం మాదిగలు, ఉపకులాలు; 1 శాతం రెల్లి సామాజిక వర్గానికి వస్తాయి. మూడూ కలిపితే 15 శాతం అవుతుంది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం తొలుత రాష్ట్రం యూనిట్ గా అమలు చేసి.. సెన్సెస్ తరువాత జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేయాలని నిర్ణయించింది.

after-sc-classification-resolution-passes-in-assembly-govt-begin-exercise-on-release-dsc-notificati

నోటిఫికేషన్ జారీ దిశగా

ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు పై ఆర్డినెన్స్ జారీ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో, ఇప్పుడు డీఎస్సీ తో సహా ఇతర పరీక్షల నోటిఫికేషన్ జారీ ప్రక్రియ వేగవంతం కానుంది. అందులో భాగంగా 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రభుత్వం గుర్తించిన ఖాళీల మేరకు స్కూల్ అసిస్టెంట్: 7,725, సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT): 6,371, శిక్షణ పొందిన గ్రాడ్యు యేట్ టీచర్ (TGT): 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT): 286, ప్రిన్సిపాల్: 52, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET): 132 పోస్టులు ఉన్నాయి. ఈ నెలాఖరు లోగానే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకా శం ఉందని అంచనా వేస్తున్నారు. జూన్ లో వేసవి సెలవుల తరువాత స్కూళ్లు ప్రారంభించే లోగా ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+