వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లీనరీ తర్వాత వైసీపీలో చర్చ ఇదే-ఎక్కడ చూసినా ఇదే మాట ! గతంతో పోలిస్తే ఎంత తేడా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ తాజాగా ప్లీనరీ నిర్వహించింది. చాలాకాలం తర్వాత నిర్వహించిన ఈ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు వెల్లువలా తరలివచ్చారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా జన సముద్రం కనిపించింది. అదే సమయంలో పార్టీ ప్లీనరీ కీలక నిర్ణయాలకు కూడా వేదికైంది. ఇదంతా పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. వైసీపీ తొలిసారి అదికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కరోనా కారణంగా నష్టపోగా.. ఈ ఏడాది మాత్రం తిరిగి కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఇది పనికొచ్చింది. అన్నింటికీ మించి ఇప్పుడు పార్టీలో ఎక్కడ చూసినా ఓ చర్చ మాత్రం వినిపిస్తోంది.

 వైసీపీ ప్లీనరీ సక్సెస్

వైసీపీ ప్లీనరీ సక్సెస్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత నిర్వహించిన ప్లీనరీ అంచనాలకు మించి విజయవంతమైంది. ఈ ప్లీనరీ ద్వారా ఎన్నో విమర్శలకు సీఎం జగన్ తో పాటు పార్టీ నేతలు కూడా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదని, క్యాడర్, నేతల్ని కలవడం లేదని, నేతల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలకు జగన్ పూర్తిస్ధాయిలో సమాధానం ఇచ్చారు. రెండు రోజుల పాటు అక్కడే కూర్చుని తన ప్రాధాన్యతలేంటో తేల్చిచెప్పేశారు. అంతే కాదు నేతలు కూడా తమ మనసుల్లో ఉన్నదంతా మొహమాటాల్లేకుండా కక్కేశారు. దీంతో వారంతా ఇప్పుడు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు.

ప్లీనరీ తర్వాత అంతా ఇదే చర్చ

ప్లీనరీ తర్వాత అంతా ఇదే చర్చ

వైసీపీ ప్లీనరీకి హాజరైన వారు, రాలేకపోయిన వారు అందరూ ఇప్పుడు ఓ విషయం మీద మాత్రం సీరియస్ గానే చర్చించుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం, వచ్చే సీట్లు, విపక్షాలన్నీ కలిసివస్తే ఏం జరగబోతోంది, వైసీపీ మిగతా పార్టీలతో పోలిస్తే ఎంత ముందుంది.. ఇప్పుడు ఎక్కడ చూసినా పార్టీ క్యాడర్, నేతల్లో ఇదే చర్చ కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీలో విజయసాయిరెడ్డితో పాటు ఇతర కీలక నేతలు, ఇన్ ఛార్జ్ లు మాత్రం ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ బిజీగా కనిపిస్తున్నారు. నిన్న విజయవాడ వచ్చిన వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కూడా మీడియా నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు.

ప్లీనరీకి ముందు- తర్వాత

ప్లీనరీకి ముందు- తర్వాత


ప్లీనరీకి ముందు వైసీపీ క్యాడర్ లో కొన్ని భయాలు ఉండేవి. సీఎం జగన్ చూస్తే తాడేపల్లి క్యాంపు ఆఫీసుకే పరిమితం అవుతున్నారు. నేతల్లో సమన్వయం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య విభేధాలు, బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకునే పరిస్ధితి ఉంది. కొన్ని సందర్భాల్లో సీఎం జగన్ స్వయంగా నచ్చజెప్పినా, హెచ్చరించినా విభేదాలు మాత్రం తొలగిపోలేదు. అలాగే విపక్షాలు కూడా మీడియా సాయంతో తమపై చేస్తున్న దాడితో వైసీపీ క్యాడర్ ఆత్మరక్షణలో పడింది. నేతలతో సహా సీఎం జగన్ కూడా తన బహిరంగసభల్లో విపక్షాలతో పాటు మీడియాపైనా పదే పదే విమర్శలు చేయడంతో క్యాడర్ లోనూ మిశ్రమ సంకేతాలు వెళ్లాయి. కానీ ప్లీనరీ తర్వాత మాత్రం పార్టీకి ఉన్న ఆదరణ, కార్యకర్తలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్లారిటీ వచ్చేసింది. అలాగే క్యాడర్ కూ నేతల నుంచి పూర్తి సహకారం లభించింది. దీంతో పరిస్ధితి పూర్తిగా మారిపోతోంది.

2024లో వైసీపీ గెలిచే సీట్లు ఇవే ?

2024లో వైసీపీ గెలిచే సీట్లు ఇవే ?

వైసీపీ ప్లీనరీ ముందు వరకూ చోటు చేసుకున్న పరిణామాలతో 2024లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు 175 సీట్లు గెలవాల్సిందేనని ఓవైపు సీఎం జగన్ టార్గెట్ పెట్టినా నేతల్లో మాత్రం ధీమా కనిపించలేదు. కానీ ప్లీనరీ జరిగిన తీరుతో క్యాడర్, నేతల్లో ఉన్న భయాలు, అనుమానాలన్నీ ఒక్క దెబ్బతో మటుమాయం అయ్యాయి. గతంలో అధికారం నిలబెట్టుకోవడంపై అక్కడక్కడా భయాలున్నా తొలగిపోయాయి. అంతే కాదు ఇప్పుడు జగన్ కంటే ధీమాగా 175 సీట్ల టార్గెట్ పై క్యాడర్ లో చర్చ జరుగుతోంది. అయితే వాస్తవ అంచనాల ప్రకారం వైసీపీ కీలక నేతలు చెప్తున్న సమాచారం ప్రకారం 2024లో 120 సీట్లకు పైగానే గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

English summary
after completiion of ysrcp pleanary now debate on retaining of power is seen everywhere.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X