లాయర్ లూథ్రా బిజీ-సునీత విజ్ఞప్తితో అవినాష్ రెడ్డి బెయిల్ పై సుప్రీం నిర్ణయం వాయిదా..
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయన సోదరి సునీతారెడ్డి తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. ఆమె చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణను వాయిదా వేసింది.
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనకు మే 31న ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డితో పాటు సీబీఐ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అవినాష్ రెడ్డి బెయిల్ పై ఉంటే సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని ఇద్దరూ వాదించారు.

అయితే ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి ఇదే కేసు విచారణ జరిగింది. ఇందులో సునీతారెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ సిద్ధార్ద్ లూథ్రా ఏపీలో చంద్రబాబు కేసుతో బిజీగా ఉండటంతో అందుబాటులో లేకుండా పోయారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపిన సునీతారెడ్డి.. కేసు విచారణ వాయిదా వేయాలని కోరారు. దీంతో ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. మూడు వారాలకు విచారణ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంలో సీబీఐతో పాటు సునీతారెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారిస్తోంది. సునీతారెడ్డి తరఫు లాయర్ సిద్ధార్ధ్ లూత్రా చంద్రబాబు కేసులో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన అందుబాటులోకి వచ్చేందుకు సమయం పడుతుందని ఆమె భావించారు. దీంతో సుప్రీంకోర్టును విచారణ వాయిదా కోరారు.












Click it and Unblock the Notifications