వైజాగ్ స్టీల్ కు భారీ డిమాండ్- కేంద్రం వద్దనుకున్న ప్లాంట్ కు గుజరాతీ సంస్ధ ఎంట్రీ-కొత్త అనుమానాలు
దేశవ్యాప్తంగా సాగుతున్న వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా తెరపైకి వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ శరవేగంగా సాగిపోతోంది. ఏపీలో పైకి కనిపించకపోయినా అంతర్గతంగా మాత్రం దీన్ని చేజిక్కించుకునేందుకు భారీ ప్రయత్నాలే జరుగుతున్నాయి. నష్టాల పేరుతో కేంద్రం అమ్మకానికి పెట్టిన ఈ ప్లాంట్ ను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పుడు గుజరాతీ సంస్ధ మిట్టల్ ఎంట్రీ ఇస్తోంది. ప్రధాని మోడీ ఆశీస్సులున్న సంస్ధగా పేరున్న మిట్టల్ గ్రూప్ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అడుగులేస్తుండటం ప్రైవేటీకరణ ప్రయత్నాలపైనే అనుమానాలు రేకెత్తించేలా ఉంది.

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేందుకు వీలుగా తమ పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా తెరపైకి వచ్చింది. గతేడాది మొదలైన ఈ ప్రక్రియ శరవేగంగా ముందుగు సాగుతోంది. ఓవైపు ఉద్యోగులు, కార్మికుల ఆందోళనలు, మరోవైపు లాభాల బాట పట్టిన ప్లాంట్, ఇంకోవైపు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విజ్ఞాపనలు.. ఇవేవీ కేంద్రాన్ని కదిలించలేకపోతున్నాయి. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయమని తేలిపోయింది. ఇక దీన్ని ఎవరు కొంటారనే చర్చ మొదలైంది. ఇందుకోసం భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టేకోవర్ కు భారీ ప్రయత్నాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కేంద్రం పెట్టుబడుల్ని ఉపసంహరించుకునేందుకు సిద్ధమైన నేపథ్యంలో దీన్ని చేజిక్కించుకునేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ముందుకు రాని సంస్ధలన్నీ ఇప్పుడు వైజాగ్ స్టీల్ టోకోవర్ కు మాత్రం ముందుకు దూకుతున్నాయి. ఇప్పటికే టాటా స్టీల్ ఈ రేసులో ముందుండగా.. తాజాగా గుజరాత్ కు చెందిన అంతర్జాతీయ స్టీల్ దిగ్గజం మిట్టల్ గ్రూప్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ రెండూ భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సంస్ధలు కావడం, స్టీల్ రంగంలో ఉన్న అనుభవం, కేంద్రంతో ఉన్న సంబంధాలు.. ఇలా పలు అంశాలు తెరపైకి వచ్చేస్తున్నాయి. దీంతో ఈ రేసు అత్యంత కాస్ట్ లీగా మారిపోతోంది.

విశాఖ స్టీల్ పై మిట్టల్ కన్ను
అంతర్జాతీయంగా ఉక్కు రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న హైప్రొఫైల్ సంస్ధ ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా ఇప్పుడు విశాఖ స్టీల్ పై దృష్టిసారించింది. కేంద్ర ప్రభుత్వ నవరత్న సంస్ధల్లో ఒకటైన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్) ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే టాటా స్టీల్ కూడా రంగంలో ఉన్న నేపథ్యంలో మిట్టల్ గ్రూప్ ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇఫ్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ఉక్కు సంస్ధల్ని టేకోవర్ చేసిన చరిత్ర కూడా కలిగిన మిట్టల్ గ్రూప్ ఇఫ్పుడు వైజాగ్ స్టీల్ పై కన్నేయడంతో ఇక టేకోవర్ లాంఛనమేన్న వాదన కూడా మొదలైంది. అదే సమయంలో దానికి ఇండియాలో ఉన్న రాజకీయ బలం కూడా తోడు కానుంది.

గుజరాతీ లాబీ అండతో
గుజరాత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్ధ వైజాగ్ స్టీల్ స్వాధీనం కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుజరాతీ వ్యాపార లాబీ సహకారం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లోని వ్యాపార కార్యకలాపాల్లో కీలకంగా ఉన్న ఈ గుజరాతీ లాబీ సహకారం ఉంటే ఎంతటి భారీ డీల్ అయినా ఇట్టే చేజిక్కికోవచ్చనే ప్రచారం నేపథ్యంలో మిట్టల్ గ్రూప్ ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవరత్న సంస్ధ అయిన వైజాగ్ స్టీల్ ను చేజిక్కించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏపీ-ఒడిశా జోన్ కేంద్రంగా తమ వ్యాపార విస్తరణకు కూడా మిట్టల్ గ్రూప్ కు అవకాశం దక్కుతుంది.

త్వరలో ఆర్ధిక మంత్రితో మిట్టల్ భేటీ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన ఆర్సెలర్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా సంస్ధకేంద్రం వద్ద కూడా లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలో గ్రూపు అధినేత లక్ష్మీ మిట్టల్ ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు ఇందులో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలుపై తమ ఆసక్తిని వ్యక్తం చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే కేంద్రం నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందన్న దానిపైనా ఆసక్తి నెలకొంది.. ఎలాగో మిట్టల్ గ్రూప్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న సంస్ధ కాబట్టి వైజాగ్ స్టీల్ డీల్ కు కేంద్రం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

కేంద్రం వద్దనుకున్న చోట గుజరాతీ ఎంట్రీ ?
కేంద్ర ప్రభుత్వం నష్టాల పేరుతో అమ్మకానికి పెట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను మిట్టల్ గ్రూప్ దక్కించుకోవచ్చన్న ప్రచారం కూడా ఇండస్ట్రీలో సాగుతోంది. ఎందుకంటే టాటా స్టీల్ తో పోలిస్తే బ్రాండ్ వ్యాల్యూతో పాటు అనుభవం, ఇతర అంశాలు కూడా మిట్టల్ కు కలిసి రానున్నాయి. అన్నింటికంటే మించి ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ కు చెందిన సంస్ధ కావడం కూడా మిట్లల్ కు ప్లస్ పాయింట్ కావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రంతో కూడా సత్సంబంధాలు నెరుపుతున్న మిట్టల్ గ్రూప్ కు వైజాగ్ స్టీల్ ను కట్టబెట్టేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉండొచ్చని సమాచారం. ఈ మేరకు త్వరలో బిడ్ దాఖలు చేసేందుకు కూడా మిట్లల్ గ్రూప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో లక్ష్మీ మిట్టల్ భేటీ తర్వాత ఈ డీల్ పై క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications