జగన్ సర్కార్ కు బీజేపీ అల్టిమేటం - జిన్నా టవర్ పేరు మార్చాలి : లేకుంటే మేమే కూలుస్తాం..!!

ఏపీలో బీజేపీ మరో కొత్త నినాదం తెర మీదకు తీసుకొచ్చింది. జగన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం తమ డిమాండ్ పైన సానుకూలంగా స్పందించకపోతే...తామే చర్యలు తీసుకుంటామంటూ బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రొద్దుటూరు లో టిప్పు సుల్తాన్ విగ్రహం వివాదం తరువాత ఇప్పుడు తాజాగా, గుంటూరు నడి బొడ్డున ఉన్న జిన్నా టవర్ పైన ఇప్పుడు వివాదం మొదలైంది. స్వాతంత్రానికి పూర్వమే..దేశ విభజనకు ముందు.. మద్రాసు ప్రావిన్సీలో కొనసాగుతున్న సమయంలో ఈ టవర్ ఏర్పాటైంది.

స్వాతంత్రానికి ముందే

అప్పట్లో గుంటూరు లో కొందరు ప్రముఖులు జిన్నాను గుంటూరుకు ఆహ్వానించారు. తమ ప్రాంతంలో ఆయనతో సమావేశం అయ్యేందుకు స్థలం నిర్ణయించారు. అయితే, జిన్నా ఆ సమావేశానికి రాలేదు. కానీ, అప్పట్లో ఆ ప్రాంతంలో జిన్నా టవర్ అనే పేరుతో ఒక టవర్ ఏర్పాటు చేసారు. ఆ ప్రాంతాన్ని సైతం జిన్నా టవర్ అనే ఇప్పటికీ పిలుస్తున్నారు. దీని పైన ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఒక ట్వీట్ చేసారు. అందులో ఇది పాకిస్థాన్ కాదు..గుంటూరు నగరంలో జిన్నా టవర్ ఉంది అంటూ ఫొటో షేర్ చేసారు.

జిన్నా టవర్ పేరు మర్చాలి

ఆ టవర్ కు పేరు మార్చుతూ డాక్టర్ కలాం లేదా దళిత రచయిత గుర్రం జాషువా పేరు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. దీని పైన హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. దేశ విభజనకు కారణమైన జిన్నా..ఎంతో మంది ప్రాణాలు పోవటానికి కారకుడని..ఆ పేరుతో సెంటర్ ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. వెంటనే ఆ టవర్ కూల్చాలని..లేకుంటే పేరు మార్చాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి ముందుకు రాకుంటే..బీజేపీ కార్యకర్తలే జిన్న పేరుతో ఉన్న టవర్ ను కూల్చాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం మార్చకుంటే..మేమే కూల్చేస్తాం

ఇక, బీజేపీ నేత విష్ణు వర్దన్ రెడ్డి సైతం దీని పైన స్పందించారు. సత్యకుమార్ ట్వీట్ తో ఏకీభవించారు. గుంటూరు లోని దేశద్రోహి జిన్నా పేరిటనున్న సెంటర్ విషయంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ గారి వ్యాఖ్యల్లో ఏ వివాదం లేదని పేర్కొన్నారు. సత్యకుమార్ వ్యాఖ్యలను తాను ను పూర్తిగా సమర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు. జిన్నా సెంటర్ పేరును మార్చకపోతే దాన్ని మేము కూలుస్తాం, పేరు మార్చుతామని హెచ్చరించారు. దేశ రాజధానిలోని ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చిన విషయాన్ని గుర్తు చేసారు. రాష్ట్ర రాజధానిలో మార్చలేమా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రభుత్వం స్పందిస్తుందా

ప్రభుత్వం స్పందిస్తుందా

కొద్ది నెలల క్రితం కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలోనూ వివాదం చోటు చేసుకుంది. ఆ సమయంలోనూ బీజేపీ నేతలు ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక, ఇప్పుడు జిన్నా టవర్ అంశంలో ఇప్పుడు, ఏపీ ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందనే చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+