
జేసీ ప్రభాకర్ రెడ్డిని వదలని కేసులు.. టీడీపీకార్యకర్తలతో సహా 13మందిపైనా.. ఆ దాడులే కారణం!!
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై మరోమారు కేసు నమోదైంది. ఇప్పటికే తాడిపత్రిలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారి ఘర్షణలకు కారణంగా మారింది. గతంలోనూ తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు 120 మంది టీడీపీ కార్యకర్తలపై కె పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోమారు జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు 13 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

జూటూరులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ .. దాడులతో ఉద్రిక్తత
ఇంతకీ ఏం జరిగిందంటే తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలో సోమవారం వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి ఘటనకు సంబంధించి మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. జూటూరులో టిడిపి వైఎస్ఆర్సిపి వర్గీయుల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఓ స్థలం విషయంలో జరిగిన గొడవ నేపద్యంలో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.

దాడులలో వైసీపీ, టీడీపీ నాయకులకు గాయాలు
ఈ దాడులలో తెలుగుదేశం పార్టీకి చెందిన నారాయణ రెడ్డి, కే నారాయణ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎర్రగుడి రామ్మోహన్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, ప్రతాప్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని తాడిపత్రి, పెద్దపప్పూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

వైసీపీ ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులపై కేసులు
ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వై ఎస్ ఆర్ సి పి, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో ఆందోళనకర వాతావరణం చోటు చేసుకుంది. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక జేసీ వర్గీయులు తమపై దాడి చేశారని ఎర్రగుడి రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రధాన నిందితులుగా పేర్కొని, మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

గతంలోనూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారని కేసు
ఇక
గతంలోనూ
తాడిపత్రిలో
టిడిపి
కౌన్సిలర్ల
పై
వరుస
దాడులను
ఖండిస్తూ
పోలీస్
స్టేషన్
ఎదురుగా
జేసీ
ప్రభాకర్
రెడ్డి
బైఠాయించి
ఆందోళన
చేసిన
క్రమంలో,
తాడిపత్రి
పోలీస్
స్టేషన్
వద్ద
హై
టెన్షన్
నెలకొంది.
అప్పుడు
కూడా
తాడిపత్రి
పట్టణంలో
30
పోలీస్
యాక్ట్
అమల్లో
ఉంటే
అనుమతులు
లేకుండా
పోలీస్
స్టేషన్
ముందు
ఆందోళన
చేపట్టారని,
ధర్నా
చేసి
ప్రజలకు
తీవ్ర
అంతరాయం
కలిగించారని
జేసీ
ప్రభాకర్
రెడ్డి
తో
పాటు
మరో
120
మంది
పై
పలు
సెక్షన్ల
కింద
పోలీసులు
కేసు
నమోదు
చేశారు.