ఏపీ విద్యలో 'ఏఐ' విప్లవం: ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి నారా లోకేష్
Minister Nara Lokesh Australia Tour: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా, గోల్డ్ కోస్ట్‌లోని గ్రిఫిత్ యూనివర్సిటీ క్యాంపస్‌లో యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ మార్నీ వాట్సన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి యూనివర్సిటీలోని అత్యాధునిక క్రీడా సౌకర్యాలను పరిశీలించారు.గ్రిఫిత్ వర్సిటీ ప్రత్యేకతల గురించి మార్నీ వాట్సన్ వివరాలు తెలియజేస్తూ.. 1975లో స్థాపితమైన తమ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అగ్రశ్రేణి పబ్లిక్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉందని చెప్పారు. క్వీన్స్‌ల్యాండ్ లో యూనివర్సిటీకి గల ఐదు క్యాంపస్‌లలో 50వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయం , స్థిరత్వం, ఆవిష్కరణ రంగాల్లో పేరుగాంచిన తమ విశ్వవిద్యాలయం 2027లో బ్రిస్బేన్ సీబీడీలో కొత్త క్యాంపస్ ప్రారంభించబోతోందని తెలిపారు. భారత్‌లో ఐఐటీ రూర్కీతో కలిసి సంయుక్త పరిశోధన, స్టూడెంట్ ఎక్స్చేంజి కార్యక్రమాలు, ఆరోగ్యం, నీటివనరులు, టెక్నాలజీ రంగాల్లో అకడమిక్ భాగస్వామ్యం వహిస్తున్నట్లు చెప్పారు.
ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్-గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. "పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేసేలా గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ లేదా హబ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయండి. సిలబస్ రూపకల్పన, నైపుణ్య ధృవీకరణ, గ్లోబల్ అకడమిక్ ప్రమాణాల కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు, APSSDC (ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్)తో భాగస్వామ్యం వహించండి. పునరుత్పాదక శక్తి, వాతావరణ స్థితిస్థాపకత, ప్రజారోగ్యం, నీటి నిర్వహణ రంగాల్లో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు ప్రారంభించండి. గ్రిఫిత్ యూనవర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ విద్యాసంస్థల మధ్య డ్యూయల్-డిగ్రీ లేదా ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయండి. (ఉదా: SRM-AP, ఆంధ్రా యూనివర్సిటీ, VIT-AP).స్కాలర్‌షిప్‌లు, అధ్యాపకులు, విద్యార్థుల అభివృద్ధికి ఎక్స్చేంజి కార్యక్రమాలను ప్రోత్సహించడం). ఈ ఏడాది నవంబర్ 14,15 తేదీల్లో ఏపీలో నిర్వహించే పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ - 2025, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫోరమ్ సమావేశాలకు హాజరుకండి. గ్రిఫిత్ విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, స్టార్టప్ మద్దతునిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలసి పనిచేయాలి" అని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.

హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు: మంత్రి నారా లోకేష్
విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ భారత్ లో ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ సెంటర్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నామని, ఉన్నత పాఠశాలల్లో ఏఐ ల్యాబ్‌లు, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏఐ విప్లవం ద్వారా వచ్చే అవకాశాలను ఏపీలోని యువత అందుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. గవర్నెన్స్ లో ఏఐ వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఏఐ ద్వారా విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ (బ్రిస్బేన్) నీతూ భాగోటియా, క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్స్ లర్ మార్క్ హార్వే, క్వీన్స్ ల్యాండ్ గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ కమిషనర్ మిచైల్ మాథ్యూస్, డైరెక్టర్ ఇంటర్నేషనల్ మార్కెట్ గార్బియేల్ ట్రూన్, స్టడీ క్వీన్ ల్యాండ్ అడిషనల్ డైరెక్టర్ స్టెఫానీ హంటర్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ మెరైన్ బయోలజీ, ఆక్వాకల్చర్ ప్రొఫెసర్ క్యాల్ జెంజర్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్ ల్యాండ్ ప్రొ వైస్ ఛాన్స్ లర్ రెన్ యూ, సిక్యూ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) మీనూ ఇస్సార్, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ సెంటర్ డైరెక్టర్ (క్వాంటమ్ సిస్టమ్స్) ఆండ్రూ రైట్, స్ట్రాటజీ మేనేజర్ శరవణన్, ఎడ్యుకేషన్ క్వీన్స్ ల్యాండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డంకెన్ మెక్ కెల్లర్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications