షర్మిల కుమారుడి రిసిప్షెన్ లో ముఖ్య నేతలు - విజయమ్మతో మంత్రాంగం..!!

వైఎస్ షర్మిల కమారుడు రాజారెడ్డి రిసిప్షెన్ గ్రాండ్ గా నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు తరలి వచ్చారు. వధూవరులు రాజారెడ్డి-ప్రియను ఆశీర్వదించారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉమేద్ ప్యాలెస్‌ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత సన్నిహిత బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక నిర్వహించారు. వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ హాజరయ్యారు. అక్కడే ఉన్న విజయమ్మను కలిసారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి రిసెప్షన్‌ శంషాబాద్‌లోని ఫోర్ట్‌ గ్రాండ్‌ లో జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ రిసిప్షెన్ కు హాజరయ్యారు. వారితో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఏపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, ఏపీసీసీ ముఖ్యనేతలు హాజరై వధూవరులు రాజారెడ్డి-ప్రియను ఆశీర్వదించారు. వీరితో పాటు రాజకీయ, వ్యాపార, క్రీడా, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హజరై నూతన వధూవరులకు విషెస్ చెప్పారు.

AICC Chief Kharge and CM Revanth Attends Rajareddy Wdding reeption along with Ministers

ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, రేవంత్‌రెడ్డి తదితరులను షర్మిల-అనిల్‌కుమార్‌ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు కాంగ్రెస్‌ నేతలను ఆహ్వానిస్తూ..వారిని వధూ వరులకు పరిచయం చేసారు. వైసీపీ ఎంపీ రఘురామ రాజు హాజరయ్యారు. అక్కడే ఉన్న విజయమ్మను పలకరించారు. కుశల ప్రశ్నలు వేసారు. అక్కడే ఉన్న షర్మిల బంధువులతోనూ రఘురామ మాట్లాడారు. గత నెలలో హైదరాబాద్ లో జరిగిన రాజా రెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయారు. స్వంత మేనల్లుడి పెళ్లికి కానీ, రిసెప్షన్ కి కానీ హాజరుకాలేదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియలు ఫిబ్రవరి 17న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+