Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి కోసం రంగంలోకి ప్రియాంక - కీలక నిర్ణయం..!!

ఏపీలోనూ కీలక నిర్ణయాల దిశగా కాంగ్రెస్ నాయకత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు పైన ధీమాతో ఉన్న కాంగ్రెస్..ఏపీలోనూ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది. అమరావతి తమ తొలి అస్త్రంగా నిర్ణయించింది. తాజాగా పార్టీ ముఖ్య నేత ప్రియాంక ఇదే విషయం పైన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. త్వరలోనే అమరావతిలో బహిరంగ సభలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో ప్రియాంక: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రియాంకతో సమావేశమయ్యారు. ఏపీ రాజకీయాల పైన చర్చ జరిగింది. రాజధాని అమరావతికి మద్దతుగా బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచన గురించి ప్రియాంకతో చర్చించారు. సభకు హాజరు కావాలని కోరారు.

AICC leader Priyanka Gandhi Announces support for Amaravati, to visit capital area soon

ఏపీ నేతల ప్రతిపాదన పైన ప్రియాంక సానుకూలంగా స్పందించారు. బహిరంగ సభకు తేదీ ఖరారు చేసి తనకు తెలియచేస్తే హాజరైన రాజధాని అమరావతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రజలకు మరోసారి తెలియచేద్దామని పార్టీ నేతలకు సూచించారు. డిసెంబర్ లేదా జనవరిలో ఈ సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.

అమరావతికి మద్దతుగా: కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తోనూ ఏపీ నేతలు అమరావతి పైన చర్చించారు. ఆ సమయంలో అమరావతి రాజధాని..విశాఖ స్టీల్ ట్ విషయంలో రాహుల్ మరోసారి పార్టీ విధానం స్పష్టం చేసారు. అమరావతి ఏకైక రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. త్వరలో ప్రియాంక అమరావతిలో పర్యటిస్తారని..భూములిచ్చిన రైతులకు మద్దతుగా నిలుస్తారని రాహుల్ వెల్లడించారు.

ఏపీకి రాజధాని లేకపోవటం బాధాకరమని వ్యాఖ్యానించారు. అమరావతిలో ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న నిర్ణయాలను పార్టీ నేతలకు రాహుల్ కు వివరించారు. విభజన చట్టంలోని హామీల అమలు..పోలవరం ప్రాజెక్టు పనులు..రాజధాని నిర్మాణం..ప్రత్యేక హోదా వంటి అంశాల్లో ఏపీకి అన్యాయం జరుగుతోందని పార్టీ నేతలకు రాహుల్ ను నివేదిక రూపంలో అందచేసారు.

AICC leader Priyanka Gandhi Announces support for Amaravati, to visit capital area soon

విశాఖకు రాహుల్: ప్రియాంకతో సమావేశమైన సమయంలోనూ ఏపీ రాజకీయ అంశాలు ప్రస్తావన చేసినట్లు సమాచారం. కేంద్రంలోకి అధికారంలోకి రాగానే ప్రతీ ఒక్క హామీని నెరవేర్చి ఏపీకి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని వారికి భరోసా ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటానికి కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసారు.

ఇదే సమావేశంలో కేంద్రంలోని అధికార బీజేపీతో ఏపీలోని రాజకీయ పార్టీల సంబంధాల పైనా పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో వైసీపీ..తెలుగుదేశం..జనసేన పార్టీలు బీజేపీతో కలిసే ఉన్నాయని..రాష్ట్రంలో మాత్రం గందరగోళంగా వ్యవహరిస్తున్నాయని పార్టీ నేతలు వివరించారు. అమరావతికి ప్రియాకం..విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా రాహుల్ వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+