కేంద్రమంత్రిపై మెడికల్ విద్యార్థుల ఇంకు దాడి
భోపాల్ : సమస్యలు వింటాడనుకున్న కేంద్రమంత్రి.. పట్టించుకోకుండానే వెను తిరగడంతో.. ఆగ్రహించిన విద్యార్థులు కేంద్రమంత్రిపై ఇంకు చల్లారు. శనివారం నాడు బోపాల్ లోని ఎయిమ్స్ సందర్శనకు వెళ్లిన మంత్రి కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఈ చేదు అనుభవం ఎదురైంది.

భోపాల్ లోని ఎయిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం కోసం వెళ్లారు జేపీ నడ్డా. ఈ సందర్బంగా.. మెడిసిన్ విద్యార్థులు జేపీ నడ్డాను చుట్టుముట్టి.. తమ సమస్యలను విన్నవించుకోవడానికి ఆయన వెంటపడ్డారు. అయితే జేపీ నడ్డా మాత్రం విద్యార్థుల మాటలను పట్టించుకోకుండా తన వాహనం వైపు వెళ్లడానికి ప్రయత్నించారు.
దీంతో కోపోద్రిక్తులైన.. విద్యార్థులు జేపీ నడ్డాపై ఇంకు చల్లారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జేపీ నడ్డాను త్వరితగతిన అక్కడి నుంచి పంపించివేశారు. దీనిపై స్పందించిన విద్యార్థులు.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనికాదని చెప్పారు. కాలేజీలో అనేక సమస్యలున్నాయని, సరైన అధ్యాపకులు, వసతులు లేవని, ఇదే విషయమై కేంద్రమంత్రికి విన్నవించుకుందామంటే.. ఆయన తమ మాట మీద వినిపించుకోకుండానే వెళ్లిపోయే ప్రయత్నం చేశారని.. అదే క్రమంలో ఆయన్ను ఆపడానికి మాత్రమే ఇంకు చల్లాల్సి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications