దాడి కేసు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కండిషన్ బెయిల్
తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డికి తిరుపతి కోర్టు బుధవారం నాడు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. చిత్తూరు జిల్లా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా అధికారిపై దాడి కేసులో మిథున్ రెడ్డి హైడ్రామా మధ్య పోలీసులు చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
మిథున్ రెడ్డి దాడి కేసుకు సంబంధించి మరింత సమాచారం

ఈ కేసులో భాగంగా మిథున్ రెడ్డిని కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి ఎంపీ మిథున్ రెడ్డికి శ్రీకాళహస్తి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
జైలులో ఉన్న సమయంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ ఎంపీ మిథున్ రెడ్డి వద్దకు వెళ్లి స్వయంగా కలిశారు. గతవారంలో అతని బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తాజాగా బుధవారం బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న తిరుపతి కోర్టు అతడికి కండిషన్ బెయిల్‌ను మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications